మాల్యాకు ‘మే’ చివరి దాకా కుదరదంట

Update: 2016-04-09 09:54 GMT
వేలాది కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి.. చెప్పాపెట్టకుండా దేశం విడిచి వెళ్లిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తనదైన తీరును మరోసారి ప్రదర్శించారు. కోర్టు కేసుల్లో భాగంగా ఈ రోజు (శనివారం.. ఏప్రిల్ 9)న  ఈడీ  ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే.. అందరూ ఊహించినట్లే అతగాడు ఈ రోజు ఈడీ ఎదుట హాజరు కాలేదు. తాను ప్రస్తుతం విచారణకు హాజరు కాలేనని.. మే చివర్లో ఏదైనా తేదీని నిర్ణయిస్తే.. అప్పటికి వస్తానని వెల్లడించాడు.

వాస్తవానికి మాల్యా ఏప్రిల్ 2న ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే..ఆ రోజు విచారణకు హాజరు కాని ఆయన మరో తేదీని అడగటం.. ఏప్రిల్ 9కి వాయిదా వేయగా.. తాజాగా.. మాల్యానే డేట్ గురించి చెప్పటం గమనార్హం. వేలాది కోట్ల రూపాయిలు బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకొని.. వాటిని కట్టకుండా గుట్టుచప్పుడు కాకుండా బ్రిటన్ కు వెళ్లిపోయి అక్కడ సేద తీరుతున్న ఆయన.. కోర్టుకు వచ్చే డేట్ ను కూడా ఆయనే చెప్పేయటం గమనార్హం. మరి.. ఇలాంటి బడాబాబుల విషయంలో చట్టం ఎందుకు కరుకుగా వ్యవహరించదో..?
Tags:    

Similar News