ఆర్థిక నేరాలు ఎదుర్కొంటున్న లిక్కర్ కింగ్ ముందుచూపుతో దేశం నుంచి జంప్ కావటం తెలిసిందే. బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయిల్ని ఎగవేసిన కేసులకు సంబంధించి సమాధానం ఏమీ చెప్పకుండానే ఆయన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాను పారిశ్రామికవేత్తనని.. దేశం విడిచి ఎక్కడికి పారిపోలేదని.. చట్టాల మీద గౌరవం ఉందంటూ బడాయి మాటల్ని ట్విట్టర్ లో ట్వీట్ ద్వారా చెప్పుకున్న మాల్యాకు సంబంధించి తాజాగా ఒక విషయం బయటకు వచ్చింది.
పైకి పత్తిత్తులా మాటలు చెబుతున్నా.. తన విదేశీ ప్రయాణానికి సంబంధించి చేసుకున్న ఏర్పాట్లు చూస్తే మాల్యా దూరదృష్టి ఇట్టే అర్థమవుతుందని చెప్పొచ్చు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఢిల్లీ.. లండన్ జెట్ ఎయిర్ వేస్ లో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించిన విషయం బయటకు వచ్చింది. ప్రయాణ సమయంలో మాల్యా వెంట ఒక మహిళ ఉందన్న విషయం బయటకు వచ్చింది.
అంతేకాదు.. తన వెంట 11 భారీ సూట్ కేసుల లగేజీని మాల్యా వెంట పెట్టుకువెళ్లిన విషయం బయటకు వచ్చింది. లండన్ లోని హెర్త్ ఫోర్ షైర్ లోని తన లగ్జరీ ఫాంహౌస్ కి చేరుకున్న ఆయన.. ఎప్పటిలా బయటకు రాకుండా తన నివాసంలోనే ఉన్న విషయం ఇప్పటికే బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.