గుజ‌రాత్ సీఎంగా రూపానీ

Update: 2016-08-05 15:34 GMT
గుజరాత్ నూతన ముఖ్యమంత్రిని ఎంపిక చేసే క్ర‌మంలో నెల‌కొన్న ఉత్కంఠ‌కు ఆ పార్టీ చెక్ పెట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ రూపానీ ఆ పార్టీ అధిష్టానం పేరును ఖరారు చేసింది. ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ పేరును ఎంపిక చేసినట్లు సమాచారం. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి ఆనంద్ బెన్ పటేల్ వయోభారంతో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలాఉండ‌గా ఈ ప‌రిణామం రిల‌య‌న్స్ వ‌ర్గాల‌కు ఊహించ‌నిద‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న సౌర‌బ్ ప‌టేల్‌కు ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశం ఉంద‌ని భావించారు. ఈయన రిలయన్సు కుటుంబానికి అల్లుడు. రిల‌య‌న్స్ సంస్థ‌ల వ్య‌వ‌స్థాప‌కుడు ధీరూభాయ్ అంబానీ అన్న రత్నిక్ భాయ్ అంబానీకి సౌరబ్ పెద్ద అల్లుడు. సొంత బావ కాక‌పోయిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం రిల‌య‌న్స్ సంస్థ‌ల అధిపతులైన ముకేశ్ అంబానీ,  అనిల్ అంబానీల‌తో ఈయనకు మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో వారి అండతో సౌరభ్ గుజరాత్ ముఖ్యమంత్రి అవుతారని అందరూ అనుకున్న‌ప్ప‌టికీ ఆ అంచ‌నాలు నెర‌వేర‌లేదు.
Tags:    

Similar News