సీరియస్ కామెంట్లు పెడుతూ.. రాజకీయ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కమ్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తరచూ ఆసక్తికర పోస్టులు పెట్టే ఆయన.. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పంచ్ ఇస్తూ ట్వీట్ ఒకటి చేశారు.
ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం జగన్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి తన ట్వీట్ తో చెప్పకనే చెప్పేశారు విజయసాయి. బాబు ప్రభుత్వంలో ఉద్దానంలోని కిడ్నీ బాధితుల అంశంపై గళం విప్పిన పవన్ కల్యాణ్.. ఇప్పడక్కడ చేపట్టిన కార్యక్రమాల గురించి పెదవి విప్పటాన్ని విజయసాయి ప్రశ్నించారు. అద్దె విమానాల్లో ఉద్దానం చుట్టూ ఎగిరిన పవన్ కల్యాణ్ కు ఇప్పుడక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 200 పడకల ఆసుపత్రి.. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పవన్ కు కనపడటం లేదా? అని ప్రశ్నించారు.
ఇప్పుడు జరుగుతున్నదంతా చూడలేక కళ్లు మూసుకున్నాడని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప వ్యవధిలోనే ఉద్దానం సమస్యను పరిష్కరించే దిశగా.. అక్కడి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సాంత్వన కలిగేలా 200 పడకల ఆసుపత్రిని.. కిడ్నీ రిసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఇదే విషయాన్ని తాజా ట్వీట్ లో చెప్పిన ఆయన.. మెట్రో నగరాల్లో తప్ప రాష్ట్ర రాజధానుల్లోకూడా ఇలాంటి సదుపాయాలు లేవని.. అలాంటి వైద్య సేవల్ని ఉద్దానంలో ఏర్పాటు చేసిన వైనాన్ని పేర్కొంటూ.. ఇవన్నీ జగన్ ఉక్కు సంకల్పం నుంచి పుట్టుకొచ్చాయే తప్పించి గాలి మాటల్లో కాదంటూ పవన్ పై భారీ ట్వీట్ పంచ్ వేశారు.