ఏపీలో ఓట్లకు సంబంధించి టీడీపీ అవకతవకలు పాల్పడుతుందా.? ఒక యాప్ ద్వారా ఓటర్లకు సంబంధిచిన మొత్తం సమాచారాన్ని సేకరిస్తోందా. అంటే ఔననే అంటోది వైసీపీ పార్టీ. అమెరికా ఎన్నికల్లో ఓటర్లను ఎలా సోషల్ మీడియా ప్రభావితం చేసిందో అలాగే.. ఇప్పుడు ఏపీలో కూడా ఓటర్ల వివరాలను తెలుసుకుని.. వారిని తమ ఓటర్లుగా మార్చుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది ఆరోపిస్తోంది వైసీపీ. అందుకు సంబంధించి సేవామిత్ర అనే యాప్ ద్వారా టీడీపీ అవకతవకలకు పాల్పడుతుందని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి.
కీలకమైన ఎన్నికలకు ముందు గెలుపే లక్ష్యంగా అధికార తెలుగుదేశం పార్టీ ఒక యాప్ ద్వారా ఓట్ల డేటాను సేకరిస్తున్నట్లు వైసీపీ ఆరోపిస్తుంది. ఈ మేరకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆధార్ సంస్థ - సైబరాబాద్ పోలీసులు - ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సేవా మిత్ర అనే అప్లికేషన్ ద్వారా ఈ రకమైన చర్యలకు టీడీపీ పాల్పడుతుందంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారా ఎలక్షన్ కమిషన్ తయారుచేసిన డేటాను టీడీపీ దుర్వినియోగం చేస్తుందంటూ ఆయన ఆరోపించారు. హైదరాబాద్ మాదాపూర్ లోని ఐటీ గ్రడ్స్ ఇండియా ప్రై లిమిటెడ్ ఆద్వర్యంలో సేవామిత్ర యాప్ పనిచేస్తుంది. అంతేకాదు.. ప్రభుత్వానికి చెందిన చాలా విభాగాల ఐటీ సొల్యూషన్స్ మొత్తం ఈ సంస్థే చూస్తోంది. దీంతో.. టీడీపీ కోసం ఈ సంస్థ పనిచేస్తుందని ఆరోపిస్తోంది వైసీపీ. సేవామిత్ర యాప్ లో ఓటర్ ఐడీ నంబర్స్ - పేర్లు - కలర్ ఫోటోలు - బూత్ లెవల్ సమాచారం - కుటుంబ వివరాలు - కులానికి సంబంధించిన సమాచారం - ప్రభుత్వ పథకాలు - ఒక్క ఓటర్ ఎంత డబ్బులు ప్రభుత్వం నుంచి లబ్ధిపొందాడు. అనే వివరాలు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ డేటా మొత్తం సేవా మిత్రలో ఉండగా టీడీపీ వాటిని వాడుకుంటుందని వైసీపీ అనుమానం వ్యక్తం చేస్తుంది. కేవలం ఒకటి రెండు శాతం ఓట్ల వ్యత్యాసంతోనే పార్టీల జయాపజయాలు నిర్ణయం అవుతున్న ఈ రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగుతున్న నకిలీ సర్వేలు - ఓట్ల దొంగలపై ఎన్నికల సంఘం గట్టి చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ కోరుతుంది.