ఢిల్లీ..గ‌ల్లీ..అన్నీ క‌లిపి బాబును వాయించిన విజ‌యసాయిరెడ్డి

Update: 2018-12-18 15:34 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తీరుపై ఇటు ట్విట్ట‌ర్ వేదిక‌గా అటు పార్ల‌మెంటు వేదిక‌గా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌ - ఎంపీ విజ‌యసాయిరెడ్డి విరుచుకుప‌డ్డారు. ఆంధ్రప్రదేశ్‌ కి ప్రత్యేక హోదా - విభజన హామీల అమలును డిమాండ్‌ చేస్తూ మంగళవారం పార్లమెంట్‌ ప్రవేశ ద్వారం ఎదుట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులైన వి.విజయసాయిరెడ్డి - వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి ధ‌ర్నా చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ చంద్ర‌బాబు సార‌థ్యంలోని టీడీపీ పుణ్యాన ఏపీకి ప్త‌ర్యేక హోదా ద‌క్క‌లేద‌ని మండిప‌డ్డారు. కేంద్రం త‌క్ష‌ణ‌మే స్పందించి త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

ఢిల్లీలో బాబు తీరును త‌ప్పుప‌ట్టిన విజ‌యసాయిరెడ్డి గ‌ల్లీలో బాబు కార‌ణంగా ప‌డుతున్న ఇబ్బందుల‌పై కూడా గ‌ళం విప్పారు. చంద్రబాబు అన్ని పనులు ముగించుకొని ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి ఈ తుఫానుకు కూడా ఇక్కడ శని పుత్రుడు చంద్రబాబు లేడని ఆ తుఫాను కూడా వెళ్లిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేర‌కు ఓ ఫోటోను ఆయ‌న ట్విట్ట‌ర్లో షేర్ చేశారు. `పెథాయ్ తుపాను కల్లోలంతో బీతావహులైన కోస్తా జిల్లాల ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటుంటే - అండగా భరోసా ఇవ్వాల్సిన చంద్రబాబు - పాలనను గాలికొదిలేసి ప్రత్యేక విమానాల్లో పోయి  రాజస్థాన్ - భోపాల్ ప్రమాణస్వీకారోత్సవాలలో బిజీగా ఉన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ అంటే ఇదే కాబోలు!` అంటూ ఓ ట్వీట్లో విరుచుకుప‌డ్డారు.

ఈ సంద‌ర్భంగా ఈవీఎంల‌పై చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌ను విజ‌య‌సాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ``ఈవీఎంలను నమ్ముకొనే చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. నాలుగేళ్లు బీజేపీతో జతకట్టి…ఈవీఎంలపై ఒక్కమాట మాట్లాడకుండా…ఇప్పుడు ఈవీఎంలు వద్దు...బ్యాలెట్ పేపర్లు కావాలటున్నాడు. ఈవీఎంలు ఇక తనని రక్షించలేవని ఎన్నికలకు 6 నెలలు ముందే బాబు ఓటమిని ఒప్పేసుకున్నాడు`` అంటూ ఆధారంగా వీడియోను కూడా షేర్ చేశారు. ఇదే స‌మ‌యంలో మీడియాతో మాట్లాడుతూ ``2014 లోనే ఈవీఎం మెషిన్లను మానిప్యులేట్ చేసి మాపై 5 లక్షల ఓట్ల తేడాతో బీజేపీ సాయంతో గెలిచారు. ఇప్పుడు మళ్ళీ ఈవీఎం మెషిన్లు వద్దు ఈ సారి ఎన్నికలకు మళ్ళీ బ్యాలెట్ పేపర్లు కావాలని రెండు నాలుకల ధోరణిలో చంద్రబాబు మాటాడుతున్నారు` అని విజ‌య‌సాయిరెడ్డి చంద్ర‌బాబు ద్వంద్వ దోర‌ణిని ఎండ‌గ‌ట్టారు.
Tags:    

Similar News