టీడిపీ... తెలుగు డ్రామా పార్టీ

Update: 2018-12-19 10:44 GMT
దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ సీతకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ తమ నిరసనను ప్లకార్డులను పట్టుకుని తమ నిరసనను తెలిపారు. విపక్షాలు కూడా పలు అంశాలపై సభలో ఆందోళన చేపట్టారు. దీంతో సభలో గందరగోల పరిస్దితి నెలకొంది. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభను గురువారానికి వాయిదా వేసారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ అవారణలో ఆందోళనకు దిగారు. ప్రత్యేక హోదా సాధించేవరకూ తమ పోరాటం ఆపమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పక ఇవ్వాలంటూ విజయసాయి రెడ్డి పార్లమెంటు ఆవారణలో గాంధీ విగ్రహం దగ్గర ఆందోళనకు దిగారు. తామూ ఆంధ్ర్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసంఆందోళన చేస్తుంటే తెలుగుదేశం పార్టీ ఎంపీలు సభలో నిశబ్దంగా ఎందుకుంటున్నారని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.

చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసారని, 2014లో ప్రత్యేక హోదా కంటే కూడా ప్రత్యేక ప్యాకేజీకే ఓటు వేసిన బాబు.. ఇప్పడు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో మాట మార్చి ప్రత్యేక హోదా అంటున్నారని విమర్శించారు. నాలుగు సంవత్సారాలు భారతీయ జనతా పార్టీతో కలసి ప్రయాణం చేసి ఆంధ్రప్రదేశ్‌కు ఆయన చేసిందేమిటని ప్రశ్నించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకుని రావడంలో చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని విజయసాయి రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడికి బాగా బుద్ది చెబుతారని విజయసాయి రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం పట్టని చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదని ఆయన దుయ్యబట్టారు. టీడిపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదని తెలుగు డ్రామా పార్టీగా విజయసాయి రెడ్డి అభివర్ణించారు.

Tags:    

Similar News