విజయసాయిరెడ్డి దెబ్బ... పీకేకు ఊపిరాడట్లేదబ్బా!

Update: 2019-09-05 14:30 GMT
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిపై ఇటీవల రేకెత్తిన రచ్చను అవకాశంగా తీసుకుని ఎంట్రీ ఇచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్... వైసీపీ సర్కారు పైనా - ప్రత్యేకించి జగన్ పైనా తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. రాజధానిపై నెలకొన్న అస్పష్టతను తొలగించేందుకే తాను రంగంలోకి దిగానన్న కలరింగ్ ఇచ్చిన పవన్... వరుసగా జగన్ పై దాడికి దిగుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు వైసీపీ తరఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి - పార్లమెంటులో ఆ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు పవన్ వెనకడుగు వేయక తప్పదన్న వాదన వినిపిస్తోంది. వపన్ వ్యవహార సరళిని తనదైన శైలిలో తూర్పారబట్టిన విజయసాయిరెడ్డి... అసలు మీ వైఖరి ఇదే కదా అంటూ చేసిన వ్యాఖ్యలతో పవన్ శిబిరం నిజంగానే డంగైపోయిందన్న వాదన వినిపిస్తోంది.

రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే ఊరుకునేది లేదని - రాజధానికి భూములిచ్చిన రైతుల తరఫున తాను పోరాటం చేస్తానని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే తాను కేంద్రం వద్దకు కూడా వెళతానని కూడా పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలను ఆదిలో వైసీపీ అంతగా పట్టించుకోలేదనే చెప్పాలి. అయితే పవన్ వ్యాఖ్యలు నానాటికీ ఎక్కువవుతున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి  ఎంట్రీ ఇవ్వక తప్పలేదు. ఇప్పుడు విజయసాయిరెడ్డి వరసపెట్టి సంధిస్తున్న విమర్శలతో పీక శిబిరం నిజంగానే సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయిందన్న వాదన వినిపిస్తోంది.

టీడీపీతో  గేమ్‌ ప్లాన్‌ లో భాగంగానే.. పవన్‌ వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ టార్గెట్‌ చేశారని విజయసాయిరెడ్డి నేరుగా ఎటాక్ మొదలెట్టేశారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న పవన్... టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వైఫల్యాలపై ఎప్పుడూ నోరు విప్పలేదని తనదైన శైలి ప్రశ్నను సంధించారు. టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలపై పవన్‌ వ్యుహత్మకంగా మౌనం వహించారని కూడా విజయసాయిరెడ్డి తన ఎదురుదాడిని మరింతగా పెంచేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు - పవన్‌ కల్యాణ్‌ లు ఒకటే అనేది అందరికి తెలిసిన విషయమేనని కూడా సాయిరెడ్డి సెటైరికల్ గా తేల్చేశారు.

ఈ సందర్భంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చే సిన విషయాన్ని గుర్తు చేసిన విజయసాయిరెడ్డి... ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన భవిష్యత్తు అందించేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుంటే... చంద్రబాబు మాత్రం ఎప్పుడూ ఆర్టీసీ ఆస్తులను అమ్మడానికే చూశారని విమర్శించారు. వేలాది మంది ఆర్టీసీ కార్మికులకు లబ్ధి చేకూర్చేలా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాల్సిన పవన్... అందుకు విరుద్ధంగా చంద్రబాబు మాదిరే విమర్శలు గుప్పిస్తున్నారని విరుచుకుపడ్డారు. పవన్ వైఖరి చూస్తుంటే... తన పాత దోస్తు చంద్రబాబుతో ఇంకా మైత్రిని కొనసాగిస్తూనే ఉన్నారని - చంద్రబాబు ఆదేశాల మేరకే జగన్ పై పవన్ విమర్శలు చేస్తున్నారని సెటైర్లు సంధించారు. విజయసాయిరెడ్డి చేసిన ఈ విమర్శలతో నిజంగానే పవన్ కల్యాణ్ శిబిరానికి ఊపిరాడట్లేదన్న వాదన వినిస్తోంది. మొత్తానికి విజయసాయిరెడ్డి దెబ్బతో పీకే శిబిరం నోరు మూతపడినట్టేనన్న వాదన వినిస్తోంది.
Tags:    

Similar News