ఏపీలో అత్యంత ఉత్కంఠ రేపిన పోలింగ్ ఎట్టకేలకు ముగిసిపోయింది. నేటి ఉదయం ప్రారంభమైన పోలింగ్ కు అక్కడక్కడ ఇబ్బందులు తలెత్తినా... చెదురు ముదురు ఘటనలు మినహా పోలింగ్ సాంతం ప్రశాంతం గానే ముగిసిందని చెప్పాలి. పోలింగ్ సరళిని పరిశీలించిన మెజారిటీ ప్రజల్లో ఈ దఫా విజయం వైసీపీదేనన్న భావన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చిన వైసీపీ ప్రధాన కార్యదర్శి - ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి... ఎన్నికల పోలింగ్ పై తనదైన శైలి కామెంట్లు చేశారు. ఈ దిశగా ఆయన వరుస ట్వీట్లు చేశారు. ఓటింగ్ సరళిని చూస్తుంటే... రాష్ట్రంలో చంద్రబాబు పాలనకు శుభం కార్డు పడినట్టేనని వ్యాఖ్యానించిన విజయ సాయిరెడ్డి... రాష్ట్రం నారాసుర పాలన నుంచి విముక్తి పొందిందని - తెలుగు ప్రజలు సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారని తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు.
సజావుగా కొనసాగుతున్న పోలింగ్ ను అడ్డుకోవడానికి చంద్రబాబు తన రౌడీ మూకలను ఉసిగొల్పినప్పటికీ... ప్రజలు ప్రజాస్వామ్యానికి రక్షణ వలయంగా నిలిచారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ గూండాల దౌర్జన్యాలు - కుల మీడియా బెదరగొట్టే వార్తలను ఏమాత్రం పట్టించుకోని జనం సునామీలా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని - తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చిన జనమంతా తమ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే నిలిచారని కూడా విజయ సాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి - రాక్షస పాలనను అంతం చేయడానికి ప్రజానీకం చూపిన చొరవకు తాను శిరసు వంచి వందనం చేస్తున్నానని కూడా విజయ సాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర చరత్రలోనే మరో సువర్ణాధ్యాయం మొదలైందని కూడా విజయ సాయిరెడ్డి కామెంట్ చేశారు.
చంద్రబాబుపై నేరుగానే విమర్శలు గుప్పించిన విజయ సాయిరెడ్డి... తాను మరోమారు అధికారంలోకి రావడానికి చంద్రబాబు వేల కోట్ల రూపాయలను వెదజల్లారని ఆరోపించారు. తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున మద్యాన్ని తెప్పించి రాష్ట్రంలో పంచారని ధ్వజమెత్తారు. వైసీపీకి ఓటేస్తారని భావించిన వారిని నానా ఇబ్బందుల పాలు చేసేందుకు యత్నించిన చంద్రబాబు అండ్ కో... కనీసం మంచి నీళ్లు కూడా వెళ్లకుండా చేసే క్రమంలో పైపు లైన్లను కూడా ధ్వంసం చేయించారని ఆరోపించారు. అయినా కూడా ప్రజలు ఎక్కడ కూడా వెనక్కు తగ్గలేదని ఆయన చెప్పుకొచ్చారు. పోలింగ్ శాతం తగ్గించేందుకు చేయాల్సిన నీచపు పనులన్నీ చేసిన చంద్రబాబు... ఇప్పుడు పత్తిత్తులా మారి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నారని కూడా విజయ సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. అధికారాన్ని కోల్పోయిన వెంటనే తాము జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతోనే చంద్రబాబు ఓ రౌడీలా వ్యవహరించారని విజయ సాయిరెడ్డి తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు.