జ‌గ‌న్ ఓకే అంటే బాబుకు బ్యాండ్ బాజానే!

Update: 2018-05-04 04:47 GMT
ఈ మ‌ధ్య కాలంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి. బాబుపై ఆయ‌న చేస్తున్న ఆరోప‌ణ‌లు.. విమ‌ర్శ‌లు సింఫుల్ గా కొట్టిపారేసేలా లేక‌పోవ‌టంతో అంద‌రూ ఆయ‌న మాట‌ల్ని ఆస‌క్తిగా వింటున్న ప‌రిస్థితి.

ఇలాంటివేళ‌.. తాజాగా బాబు సైతం ఉలిక్కిప‌డే మాట ఒక‌టి చెప్పారు విజ‌య‌సాయి. అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆదేశిస్తే రానున్న ఎన్నిక‌ల్లో తాను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. నాలుగేళ్ల బాబు స‌ర్కారు ఏమీ చేయ‌లేదంటూ మండిప‌డిన విజ‌య‌సాయి రానున్న ఎన్నిక‌ల్లో బాబుపై పోటీకి సిద్ధం కావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఒక‌వేళ‌.. విజ‌య‌సాయి మాట‌ల‌కు బాబు కానీ ఓకే అంటే మాత్రం.. షాకింగ్ ప‌రిణామాలు ఏర్ప‌డ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. సూటిపోటీ విమ‌ర్శ‌లు చేసుకోవ‌టం ఒక ఎత్తు. ఏకంగా ముఖాముఖిన ఎన్నిక‌ల గోదాలోకి ఇద్ద‌రు ప్ర‌ముఖులు దిగ‌టం మ‌రో ఎత్తు. విజ‌య‌సాయి కోరుకున్న‌ట్లు బాబుపై పోటీకి జ‌గ‌న్ ఓకే అంటే మాత్రం.. 2019 ఎన్నిక‌ల్లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించే పోటీగా వీరిద్ద‌రి మ‌ధ్య పోటీ నిలుస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News