తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఓ ఐరన్ లెగ్ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవాచేశారు. బాబు కలిసినప్పటినుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి కష్టాలు మొదలయ్యాయని ఆదివారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఎస్పీ-బీఎస్పీ పొత్తు కుదుర్చుకుని కాంగ్రెస్ ను పక్కనపెట్టి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తామే పోటీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌తో షాక్ తిన్న కాంగ్రెస్ పార్టీ తాము ఒంటరిగానే బరిలో దిగుతామని ప్రకటించింది.
కాగా, ఈ ఎపిసోడ్ పై విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. రాహుల్ ఓ ఐరన్ లెగ్ అని పేర్కొంటూ యూపీలో పరిణామాలే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. `` రాహుల్‌ను చంద్రబాబు ఆలింగనం చేసుకున్నప్పటి నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడికి కష్టాలు వచ్చిపడుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ను దూరంపెట్టి అఖిలేశ్ - మాయావతి కలిసి పోటీచేస్తున్నారు. వాళ్లిద్దరూ కాంగ్రెస్‌కు సంబంధంలేని ఫ్రంట్ ఏర్పాటుచేస్తారట. ఇంకెక్కడి యూపీఏ?.. బాబు ఐరన్ లెగ్ మహిమ`` అని ఎద్దేవా చేశారు.
ఇదిలాఉండగా, ఎస్పీ-బీఎస్పీ పొత్తుతో షాక్ తిన్న కాంగ్రెస్ పార్టీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ రాష్ట్ర నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..బీజేపీని ఓడించడానికి తాము ఒంటిరిగానే బరిలోకి దిగుతామన్నారు. 2009లో మాదిరిగానే రాష్ట్రంలో రెండంకెల స్థానాలను సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తమతో కలిసివచ్చే పార్టీలతో కలిసి బీజేపీని ఓడిస్తామని తెలిపారు. ఎస్పీ - బీఎస్పీల కూటమిలో కాంగ్రెస్ లేకపోవడం పట్ల స్పందిస్తూ.. వారు తమతో కలిసిరాకపోతే తామేం చేయలేమన్నారు. ప్రధాని మోడీకి దేశం మీది కంటే తన కుర్చీ మీదే ఎక్కువ మమకారమని విమర్శించారు.