టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాజీ మంత్రి - గులాబీ దళపతి కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఎన్నికైన సంగతి తెలిసిందే. తనదైన శైలిలో ఆయన పార్టీ కార్యక్రమాల్లో దూసుకుపోతున్నారు. అయితే, ఈ ఎపిసోడ్ పై ఎంపీ - వైసీపీ ప్రధాన కార్యదర్శి వై విజయసాయిరెడ్డి స్పందిస్తూ....టీడీపీ రాజకీయాలు - మంత్రి లోకేశ్ పై సెటైర్లు వేశారు. ``తెలంగాణలో కేటీఆర్ టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటినుంచి లోకేశ్ కు నిద్రపట్టడం లేదు. తండ్రి అర్జంటుగా తప్పుకొని సీఎం కుర్చీని లేదా పార్టీ బాధ్యతలను తనకు అప్పగిస్తే బాగుండని కలలుకంటున్నాడు. చంద్రబాబు ఈ విషయంలో కొడుకును కూడా నమ్మడని తెలియదు పాపం చిట్టినాయుడికి..`` అంటూ ఎద్దేవా చేశారు.
ఏపీ సర్కారు పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ``తూర్పుగోదావరి జిల్లా కట్టమూరులో మంత్రి లోకేశ్ ను మహిళలు తరిమికొట్టారు. వచ్చే మూడునెలలు పచ్చ పార్టీ నేతలకు ఇటువంటి పరాభవాలు తప్పవు`` వాస్తవాలతో కూడిన హెచ్చరికలు చేశారు. ఏపీలో సంక్రాంతి వాతావరణం లేదని విజయసాయిరెడ్డి వాపోయారు. ఓ వైపు కరువు - మరోవైపు పంటలకు కనీస వసతులు లేకపోవడం వంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలకు దక్కుతున్న విశేష స్పందన, జగన్ పాదయత్రలో కనిపించిన ప్రజా స్పందనను చూసి వణికిపోయిన చంద్రబాబు పెంచన్ల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నారని పేర్కొన్న విజయసాయిరెడ్డి చంద్రబాబు రాబోయే కాలంలో ఇలాంటి చర్యలు మరిన్ని చేస్తారని ఆయన జోస్యం చెప్పారు.
Full View