వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిని మరోమారు ఆయన చాటిచెప్పారు.ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ద్వంద్వ రీతిని ఆయన బట్టబయలు చేశారు. బాబు ప్రచార పర్వం గురించి స్పందిస్తూ ``1980-90 వార్తా పత్రికల్లో ఏది వచ్చినా ప్రజలు నిజమని నమ్మే వారు. తర్వాత మీడియా విస్తృతి పెరుగుతూ వచ్చింది. రకరకాల సమాచారం వస్తుంటే నిజమేదో - అబద్ధమేదో తెలిసిపోతోంది. ప్రజలు అప్ డేట్ అయినా పాపం చంద్రబాబు ఆయన కుల మీడియా ఇంకా తాము ఏది వదిలినా దానినే విశ్వసిస్తారనే భ్రమలో ఉన్నారు.`` అంటూ ఎద్దేవా చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ చెప్పిన అంశాన్ని ప్రస్తావిస్తూ విజయాసాయిరెడ్డి బాబు విధానాలను మరో ట్వీట్ లో బయటపెట్టారు. ``కన్నా గారు చెప్పింది అక్షర సత్యం. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ జగన్ గారిపై ఏదో ఒక నేరం మోపి మళ్లీ అరెస్టు చేయండని దగాబాబు ఒత్తిడి చేశాడు.రాష్ట్ర సమస్యలు - నిధుల పై చర్చ లేదు. కాంగ్రెస్ అక్రమ కేసులు పెడితే తామెలా చేస్తామని కేంద్రం స్పష్టం చేసేసరికి కాంగ్రెసే నయమని అటువైపు జారిపోయాడు`` అంటూ బాబు తీరును బట్టబయలు చేశారు. ``బాహుబలిని పొడిచి చంపిన ‘కట్టప్ప కత్తి’...వెన్నుపోటుకు సింబల్. రాజకీయాలలో వెన్నుపోట్లకు చంద్రబాబు కట్టప్ప కత్తినే వాడతారు. ఎన్టీఆర్ తో మొదలెట్టి నారా కట్టప్ప నాయుడి కత్తికి బలైపోయిన అనేక మంది చంద్రబాబు వెన్నుపోటు లిస్ట్‌లో చేరారు. టీడీపీ ఇప్పుడు సిసలైన ‘కట్టప్ప కత్తి పార్టీ`` అంటూ చంద్రబాబు తీరును ఎద్దేవా చేశారు.
``వాస్తవిక స్థితికి అద్దం పట్టేది శ్వేత పత్రం. పచ్చి అబద్దాలు - అంకెల గారడీతో శ్వేత పత్రంకు ఉండే విశ్వసనీయతను భ్రష్టు పట్టించారు చంద్రబాబు. అంతర్జాతీయ అవార్డులతో సుపరిపాలనలో దేశానికే దిక్సూచి అయ్యామని బాబు సెల్ఫ్ డబ్బా. సామాన్యుల జీవన ప్రమాణాలు మాత్రం ఎండమావులే`` అంటూ చంద్రబాబు శ్వేతపత్రాల ఎపిసోడ్ ను ఎద్దేవా చేశారు.