ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత.. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఒకటికి మించి మరొకటి అన్నట్లుగా ఉన్న ఈ ట్వీట్లు ఏపీ రాజకీయాల్ని మరింత రసవత్తరం చేసేలా మారాయి.
సూటిగా.. సుత్తి లేకుండా పలు అంశాల్లో బాబు వైఫల్యాల్ని.. దుర్మార్గాల్ని.. కుట్రల్ని బయటపెట్టేలా ఆయన ట్వీట్లు ఉండటం గమనార్హం. ఈ రోజు ఉదయం నుంచి వరుస పెట్టి ఆయన పెడుతున్న ట్వీట్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
విజయసాయి ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన ట్వీట్లను చూస్తే..
+ చంద్రబాబూ! రాజకీయ చరమాంకంలోవున్న జేసీ దివాకర్ జాతీయస్థాయి దళారీ అయిన మీ ప్రసన్నం కోసం - ప్రజలని కాకుండా మిమ్మల్ని చూస్తూ జగన్ గారిని - రెడ్డి సామాజిక వర్గాన్ని తిడుతుంటే మీ ముఖంలో ఈరోజు కనిపించిన ఆనందం ఏ సభ్యత సంస్కారాలకు నిదర్శనమో చెప్పగలరా? ఇలాంటి సభ పెట్టటానికి మీకు సిగ్గుందా?
+ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రానికి వదిలేస్తే ఈపాటికి పూర్తయ్యేది. రాష్ట్రమే చేపడుతుందని చెప్పి వ్యయాన్ని అడ్డగోలుగా రూ.58 వేల కోట్లకు పెంచారు. ఖర్చుకు లెక్క చూపకుండా - యూసీలు పంపకుండా రాష్ట్ర వరప్రదాయినిని కుంభకోణాల పుట్టగా మార్చారు నాయుడుబాబు.
+ బిజెపి వ్యతిరేక ఫ్రంట్ పేరుతో వెళ్లి మీరు వీణలు బహుకరించిన వారంతా కేసీఆర్ ను స్వాగతించి ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను అభినందిస్తున్నారు. అఖిలేశ్ యాదవ్ తానే వచ్చి కేసీఆర్ ను కలుస్తానని ప్రకటించారు. మీ యాత్రలన్నీ ఫెయిలైనట్టున్నాయి చంద్రంసారూ. గెలిచిన వారికే గొడుగులు పడతారు.
+ విభజన హామీలకు - ప్రత్యేక హోదాకు నాలుగున్నరేళ్లుగా తుప్పు పట్టించిన మీరు - కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి రాష్ట్రం డబ్బుతో ఎన్నికలకు మూడు నెలల ముందు శంకు స్థాపన చేస్తారా? చుట్టూ కొన్న వేల ఎకరాల కోసం మీరు ఆడుతున్న నాటకం ఇప్పటికే కడప ప్రజలకు అర్ధమైంది.