నిజాయితీ అన్న బాబు నోరెత్త‌లేని రీతిలో ట్వీట్ పంచ్!

Update: 2019-07-03 09:57 GMT
ప్ర‌త్య‌ర్థుల‌కు వేలెత్తి చూపించే అవ‌కాశాన్ని ఇవ్వ‌టంలో ఏపీ విప‌క్ష నేత చంద్ర‌బాబు త‌ర్వాతే ఎవ‌రైనా. చేయాల్సిన త‌ప్పులు చేసి.. సుద్ద‌పూస మాట‌లు మాట్లాడ‌టంలో ఘ‌నాపాఠి అయిన బాబుకు మరోసారి పంచ్ ప‌డింది. నీతి.. నిజాయితీ అన్న‌ది త‌న ఇంటిపేర్లుగా చెప్పుకునే నారావారి వ్య‌వ‌హారాలు తెలీని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో లేర‌ని చెప్పాలి.  త‌న‌ది అలాంటి ఇలాంటి ఇండ‌స్ట్రీ కాద‌ని.. త‌న‌కు మించిన పోటుగాడు దేశంలోనే ఉండ‌ర‌న్న‌ట్లుగా గొప్ప‌లు చెప్పే చంద్ర‌బాబు.. ప్ర‌త్య‌ర్థి వేలెత్తి చూప‌లేని రీతిలో మాత్రం మాట్లాడ‌లేక‌పోవ‌టం విశేషం.

నీతి..నిజాయితీ విష‌యంలో త‌న‌కు మించినోళ్లు లేదంటూ గురివింద నీతులు చెప్పే బాబును త‌న ట్వీట్ల‌తో మ‌రోసారి ఉతికి ఆరేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి. విత్త‌నాల సేక‌ర‌ణ‌కు రూ.380 కోట్లు విడుద‌ల చేయాలంటూ ఫిబ్ర‌వ‌రిలో ఏపీ సీడ్స్ కార్పొరేష‌న్ ను కోరితే.. ఆ నిధుల్ని ఓట‌ర్ల కోసం మ‌ళ్లించార‌న్న స‌మాధానం వ‌చ్చింద‌న్న ఆయ‌న‌.. పింఛ‌న్ల పెంపుతో బురిడీ కొట్టించ‌టానికి రూ.30వేల కోట్లు మాయ పేలాలు చేశార‌ని ఫైర్ అయ్యారు.

మీరు నిజాయితీ గురించి మాట్లాడుతున్నారంటే మీ ధైర్యానికి జోహార్లు బాబు అంటూ ఎద్దేవా చేశారు. ప్ర‌జాశ్రేయ‌స్సును మ‌రిచి.. నిత్యం త‌న సౌక‌ర్యాల గురించి బాబు పోరాడుతుంటార‌ని త‌ప్పు ప‌ట్టారు. ప్ర‌జానాయ‌కుడిగా ప్ర‌జ‌ల గురించి ఆలోచించాల్సిన చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కు రాసిన మొద‌టి లేఖ‌లో ప్ర‌జావేదిక‌ను త‌న‌కు కేటాయించాల‌ని కోరిన విష‌యాన్ని గుర్తు చేశారు. తాజాగా త‌న‌కు భ‌ద్ర‌త పెంచాలంటూ హైకోర్టులో పిటిష‌న్ వేసిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. క‌నీసం తీసుకునే వేత‌నానికైన ప్ర‌జ‌ల గురించి కాస్త ప‌ట్టించుకోవాలంటూ చురుకు పుట్టేలా ట్వీట్ చేశారు. విజ‌య‌సాయి చేసిన ట్వీట్ల‌ను య‌థాత‌ధంగా చెప్పుకొస్తే..

+  ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలను గాలికొదిలి తన సౌకర్యాల గురించి పోరాడుతున్నారు చంద్రబాబు. ప్రభుత్వానికి రాసిన మొదటి లేఖలో ప్రజావేదికను కేటాయించాలని కోరారు. తనకు భద్రత పెంచాలని ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. వేతనం తీసకుంటున్నందుకైనా ప్రజలను కాస్త గుర్తు పెట్టుకోండి బాబూ.

+  విత్తనాల సేకరణకు 380 కోట్లు విడుదల చేయాలని ఫిబ్రవరిలో ఏపీ సీడ్స్ కార్పోషన్ కోరితే ఆ నిధులను ‘ఓటర్ల ప్రలోభాలకు’ మళ్లించారు. పసుపు-కుంకుమ - పింఛన్ల పెంపుతో బురిడీ కొట్టించడానికి 30 వేల కోట్లు మాయ పేలాలు చేశారు. ఇంకా నిజాయితీ గురించి మాట్లాడుతున్నారంటే మీ ధైర్యానికి జోహార్లు బాబూ.


Tags:    

Similar News