సినిమాలో పంచ్ డైలాగులు ఎంత ఫేమస్సో.. ట్వీట్లతో ఉక్కిరిబిక్కిరి చేసే విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీరు వేరుగా ఉంటుంది. సుత్తి లేకుండా సూటిగా చెప్పాల్సిన మాటల్ని చెప్పేయటంలో ఆయన తర్వాతే ఎవరైనా. డైలీ బేసిస్ లో ఆయన వేసే పంచ్ లతో ప్రత్యర్థులు ఉక్కిరిబిక్కిరి చేసేలా ట్వీట్లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
ప్రజావేదిక కూల్చివేత ఎపిసోడ్ లో సానుభూతి పొందాలని బాబు చేసిన ప్రయత్నాన్ని తన తాజా ట్వీట్ తో చెప్పారు విజయసాయి. రేకుల షెడ్డుకు రూ.9కోట్లు ఎందుకు ఖర్చు అవుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారని.. ప్రజావేదిక కూల్చివేత తర్వాత రాజధాని విషయంలో ఇంకెంత అవినీతి జరిగిందన్న చర్చ మొదలైనట్లు చెప్పారు.
జగన్ తన 30 రోజుల పాలనలో 5 కోట్ల మంది ప్రజల్లో ధైర్యాన్ని నింపారని.. వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ పాలనపై తనదైన ముద్ర వేస్తున్న ముఖ్యమంత్రి మరే రాష్ట్రంలో కనిపించరన్న ఆయన.. ఇటీవల చంద్రబాబు పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంపై వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు.
ప్రజాసమస్యలపై చర్చించి ప్రభుత్వానికి విలువైన సూచనలకు బదులుగా.. తాను అద్దెకు ఉండే ఇంటికి నోటీసులు ఇవ్వటంపైనా.. నారావారిపల్లెలోని భవనానికి కాపలా తగ్గించటంపైన సంతాప తీర్మానాలు చేశారంటూ ఎద్దేవా చేశారు. పలు అంశాలపైన చేసిన ఈ ట్వీట్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
విజయసాయి చేసిన ట్వీట్లను యథాతధంగా చూస్తే..
+ ప్రజావేదిక తొలగింపును వివాదాస్పదం చేసి సానుభూతి పొందాలని చంద్రబాబు గారు ఆయన ముఠా వేసిన ఎత్తుగడ ఎదురు తన్నింది. రేకుల షెడ్డుకు 9 కోట్ల ఖర్చెలా అవుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాజధాని వ్యవహారాల్లో ఇంకా ఎంత అవినీతి జరిగిందోనన్న చర్చ మొదలైంది.
+ సీఎంగా ప్రమాణం చేసిన 30 రోజుల్లోనే జగన్ గారు 5 కోట్ల మంది ప్రజల్లో ధైర్యం నింపారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ పాలనపై తన ముద్ర వేసిన ముఖ్యమంత్రి ఇంకే రాష్ట్రంలోనూ కనిపించరు. ‘నేను ఉన్నా’ అని ఆయన ఇచ్చిన భరోసా అన్ని వర్గాల ప్రజానీకంలో ఆత్మ విశ్వాసం నింపింది.
+ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారంటే ప్రజా సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి విలువైన సూచనలేమైనా చేస్తారనుకున్నాం. కానీ ఆయన అద్దెకు ఉంటున్న ఇంటికి నోటీసులివ్వడం పైనా, నారావారిపల్లెలోని భవనానికి కాపలా తగ్గించడం పైన సంతాప తీర్మానాలు చేశారు. అంటే మీ సమస్యే ప్రజా సమస్యా?
+ కేశినాని గారూ ఇకనైనా మారండి. మీ అధినేత బిజెపిని సమర్థిస్తే అందరూ జై కొట్టాలి. యూ-టర్ను తీసుకుని కాంగ్రెస్ గుంపులో చేరితే అది గొప్ప నిర్ణయమనాలి. తెలంగాణ సీఎంతో ఘర్షణ వైఖరి అవలంబిస్తే మేమూ అదే చేయాలా? యుద్ధం ఎప్పుడు చేయాలో - సామరస్యంగా ఎప్పుడు మెలగాలో మా సీఎం గారికి తెలుసు.