తన ట్వీట్స్ తో తమ్ముళ్లలో బీపీ పెంచేసే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తాజాగా తమ్ముళ్లకు గ్యాంగ్ లీడర్ చంద్రబాబు గుండెలు అదిరిపోయేలా కొన్ని ట్వీట్లు చేశారు. రానున్న రోజుల్లో ఏం జరగనుందన్న విషయాన్ని చెప్పేసిన ఆయన మాటలు వింటుంటే.. రానున్నదంతా సంచలనాల కాలమేనన్న భావన కలుగక మానదు.
రాజాధాని పేరుతో అదే పనిగా వ్యాఖ్యలు చేసే చంద్రబాబు లోగుట్టు భాగోతాన్ని తాము బయటపెట్టనున్న విషయాన్ని తాజాగా చేసిన ట్వీట్ తో చెప్పేశారు విజయసాయి. అమాయకపు రైతుల పొట్టల్ని.. రాజధాని అమరావతి పేరుతో కొట్టారన్న ఆయన.. అందుకు సంబంధించిన వేల ఎకరాల స్టోరీలన్ని సీరియల్ గా వచ్చేస్తాయన్న మాట ఇప్పుడు కలకలం రేపుతోంది. కొద్ది రోజులు ఆగితే.. లీలలన్ని స్టోరీల రూపంలో సీరియల్ గా వస్తాయంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు.. అమరావతి కలల రాజధానో.. కులపు రాజధానో తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ తో అమాయక రైతుల పొట్టకొట్టి మీరూ.. మీ బినామీలు లాగేసుకున్న వేలాది ఎకరాల కథల్ని సీరియల్ గా వరుసగా బయటకు వస్తాయని హెచ్చరించారు.
ఆ దెబ్బతో మీరు నిప్పులో.. తుప్పులో తేలిపోతుందని.. ప్రజలే ఆ విషయాల్ని చెప్పేస్తారన్నారు. ఈ సందర్భంగా ఆయన కాస్తంత ఆగ్రహంతో.. కాండ్రించి ఉమ్ముతారన్న మాటను అనేశారు. మరో ట్వీట్ లో మనీ లాండరింగ్ దళారి సానా సతీశ్ తో చంద్రబాబుకు ఆయన పార్టీ నేతలకు ఉన్న సంబంధాలపై కేంద్రం దర్యాఫ్తునకు ఆదేశించాలన్నారు. చిరుద్యోగం చేసుకునే వ్యక్తి అంతర్జాతీయ ఆర్థిక నేరగాళ్లకు పనులు చేసి పెట్టే స్థాయికి ఎదగటం వెనుక చంద్రబాబే ఉన్నట్లుగా ఆరోపించారు. ఈ విషయం అందరికి తెలుసన్నారు.
నీటి కొరత.. రోగాలు.. కరువు.. తుఫాన్లతో ఏపీ ప్రజలు విలవిలలాడిపోతుంటే.. దావోస్ కు వెళ్లి..ఐదేళ్లలో వంద కోట్లు తగలబెట్టిన ఘనత చంద్రబాబు సొంతమని.. అంత ఖర్చు పెట్టినా.. ఒక్క కంపెనీ రాలేదన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బాబు దుబారా ఖర్చు ఏ స్థాయిలో ఉందో చెప్పి విస్మయానికి గురి చేశారు. దావోస్ లో ఏపీ లాంజ్ కోసం రూ.17 కోట్లు మంచినీళ్లలా ఖర్చు చేయటంపై దర్యాప్తు జరగాలని.. నాలుగు రోజుల భోజనాలకు రూ.1.05 కోట్లు ఖర్చు చేసి.. ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారో తేలాలన్నారు.
ఇంకో ట్వీట్ లో కాపులకు ద్రోహం చేసిందెవరన్నది తన అంతరాత్మను అడగాలని జ్యోతుల నెహ్రూను కోరిన విజయసాయి.. అసాధ్యమని తెలిసి కూడా 5 శాతం రిజర్వేషన్ ప్రకటిస్తే బాబును పొగిడింది మీరు కాదా? అని ప్రశ్నించారు. సూటిగా.. సుత్తి లేకుండా మంట పుట్టేలా ట్వీట్లు చేసిన విజయసాయి ట్వీట్లను యథాతధంగా చూస్తే..
+ కొద్ది రోజులాగు చిట్టి నాయుడూ? అమరావతి కలల రాజధానో - కులపు రాజధానో తెలుస్తుంది. ఇన్ సైడర్ ట్రేడింగుతో అమాయక రైతుల పొట్టకొట్టి మీరూ - మీ బినామీలు లాగేసుకున్న వేల ఎకరాల స్టోరీలన్నీ సీరియల్ గా బయటకొస్తాయి. మీరు నిప్పులో తుప్పులో ప్రజలే చెబుతారు. కాండ్రించి ఉమ్ముతారు.
+ మనీలాండరింగ్ దళారి సానా సతీశ్ తో చంద్రబాబు - ఆయన పార్టీ ప్రముఖుల సంబంధాల పైనా కేంద్రం దర్యాప్తుకు ఆదేశించాలి. చిన్న ఉద్యోగం చేసుకునే వ్యక్తి అంతర్జాతీయ ఆర్థిక నేరగాళ్లకు పనులు చేసే పెట్టే స్థాయికి ఎదగడం వెనక ఉన్నది చంద్రబాబే అని అందరికీ తెలుసు.
+ రోమ్ తగలడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తిని మరపించారు చంద్రబాబు. నీటి కొరత - రోగాలు - కరువు - తుఫాన్లతో ఇక్కడ ప్రజలు విలవిల్లాడుతుంటే దావోస్ సదస్సులో పాల్గొనేందుకు ఐదేళ్లలో వంద కోట్లకు పైగా తగలేశారు. ఒరిగింది శూన్యం. ఒక్క పరిశ్రమ రాలేదు.
+ పెట్టుబడుల ఆకర్షణ పేరుతో చంద్రబాబు గారు దావోస్ లో ఏపీ లాంజ్ కోసం రూ.17 కోట్లు మంచి నీళ్లలా ఖర్చు చేయడంపై దర్యాప్తు జరగాలి. 4 రోజుల భోజనాలకు 1.05 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారో తేలాలి.
+ కాపులకు ద్రోహం చేసిందెవరో మీ అంతరాత్మను అడగండి జ్యోతుల నెహ్రూ గారూ. పదవి - ప్యాకేజీ కోసం మీరు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది వాస్తవం కాదా? అసాధ్యమని తెలిసీ 5 శాతం రిజర్వేషన్ ప్రకటిస్తే బాబును పొగిడింది మీరే కదా? ఇప్పుడు ఎవరు ఉసిగొల్పితే విమర్శలు చేస్తున్నారో అందరికీ తెలుసు.