సినిమా విడుదలకు ముందు టీజరు బయటకు రావటం.. సినిమా మీద ఆసక్తిని మరింతగా పెంచటం.. సినిమా విజయం మీద అంచనాల హైప్ క్రియేట్ చేయటం తెలిసిందే. తాజాగా జగన్ ప్రభుత్వానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలకు సంబంధించిన సినిమాకు ముందు టీజర్ విడుదల ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ ప్రాధామ్యాలతో పాటు.. అధికారులు ఏం అంశం మీద దృష్టి పెట్టారన్న విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమ్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడిస్తున్నారు.
తాజాగా విజయసాయి చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. జగన్ సర్కారు తర్వాతి ఫోకస్ కియా కార్ల కంపెనీ పేరుతో తెలుగు తమ్ముళ్లు.. బాబు సర్కారు చేసిన ఎదవ పనుల వ్యవహారాన్ని బయటకు తీసుకురానున్న విషయాన్ని తన తాజా ట్వీట్ తో వెల్లడించటం విశేషం.
ఇంటికో ఉద్యోగం కియా కార్ల కంపెనీ రాకతో వస్తుందంటూ ఊదరగొట్టిన కులమీడియా ఇప్పుడు కొత్త రాగాన్ని అందుకున్నట్లు చెప్పారు. అక్కడంతా తమిళులేనని.. ప్రాజెక్టు అభివృద్ధి జరగలేదన్న ఏడుపు లంకించుకన్నట్లుగా వెల్లడించారు. దొంగ ఏడుపులు వద్దని.. యువ సీఎంకు ఏం చేయాలో తెలుసని చెప్పిన విజయసాయిరెడ్డి ట్వీట్.. ముక్తాయింపుగా చేసిన వ్యాఖ్య ఇప్పుడు తెలుగు తమ్ముళ్ల గుండెలు అదిరేలా చేస్తున్నాయి. కియా పేరుతో జరిగిన భూకుంభకోణం పుట్ట త్వరలోనే పగులుతుందని పేర్కొన్నారు. కియా పేరుతో భారీ ఇమేజ్ సొంతం చేసుకున్న బాబు సర్కారు అసలు గుట్టు త్వరలో బయటకు రానుందన్న విషయం విజయసాయి రెడ్డి ట్వీట్ తో స్పష్టం చేస్తుందని చెప్పాలి.