తమిళనాడు చిరంజీవి.. విజయకాంత్

Update: 2016-05-23 07:58 GMT
 సినిమావాళ్లు రాజకీయాల్లోకి రావడం ఎప్పటి నుంచో ఉంది. తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇది మరీ ఎక్కువ. కేవలం రాజకీయ పార్టీల్లో చేరి విజయాలు అందుకోవడమే కాకుండా పార్టీలు పెట్టి ముఖ్యమంత్రులుగా రాజ్యమేలారు. ఇతర రాష్ట్రాల్లోనూ సినిమా ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చినా కేవలం ఏదో ఒక పార్టీలో ఉండడానికి మాత్రమే పరిమితమవుతున్నారు. తమిళనాడు - ఏపీల్లో మాత్రం ఎంజీఆర్ - జయలలిత - కరుణానిధి - ఎన్టీఆర్ వంటివారు ముఖ్యమంత్రులయ్యారు.  వారి స్ఫూర్తితో ఏపీలో చిరంజీవి - తమిళనాడులో విజయకాంత్ వంటివారు సొంత రాజకీయ పార్టీలు పెట్టుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకోవాలని ప్రయత్నించినా మధ్యలోనే విఫలమయ్యారు. ఏపీలో చిరంజీవి ఇప్పటికే తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేయడం.. అక్కడ మంచి పదవులు అందుకున్నా కూడా కాంగ్రెస్ పరిస్థితి కూడా బాగులేకపోవడంతో మళ్లీ 150వ సినిమా అంటూ పూర్వాశ్రమంలోకి ఎంటరయ్యారు. తమిళనాడులో కూడా విజయకాంత్ డీఎండీకే పార్టీ పెట్టి ప్రభావం చూపినా, ఈ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా దెబ్బతిన్నారు. ఒక్కసీటు కూడా సాధించలేకపోయారు. దీంతో విజయకాంత్ కూడా ఇప్పుడు మళ్లీ సినిమాల వైపు చూస్తున్నారు.

సినిమాల్లో స్టార్ డమ్ తో రాజకీయాల్లో రాణిద్దామని ప్రయత్నించిన చిరంజీవి - విజయకాంత్ ల ఇద్దరి పరిస్థితి ఇప్పుడు ఒకేలా ఉంది. ఇటు రాజకీయాల్లో రాణించలేక.. అటు సినిమాలు తీద్దామంటే వయసు మీరడంతో ప్రేక్షకులు మునుపటిలా ఆదరిస్తారో లేదో తెలియక డోలాయమానంలో పడుతున్నారు.  తమిళ ప్రేక్షకులు కెప్టెన్ అని ముద్దుగా పిలుచుకునే విజయ్ కాంత్ పరిస్థితి ఇప్పుడు సరిగ్గా ఇలాంటి పరిస్థితిలోనే ఉణ్నారు.  2011 ఎన్నికల్లో 28 సీట్లతో పర్లేదనిపించింది విజయ్ కాంత్ డిఎండికే పార్టీ. కానీ ఈ సారి సొంతంగా హీరో అవుదామని వెళ్లి బొక్కబోర్లా పడ్డాడు కెప్టెన్. కనీసం ఒక్క సీట్ కూడా సంపాదించుకోలేకపోయాడు. అంతేకాదు.. తాను కూడా ఓడిపోయాడు. దాంతో ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి వచ్చేస్తున్నాడు విజయ్ కాంత్. ఎన్నికల్లో ఓడిన మరుసటి రోజే నాన్ తమిళన్ సొల్లు అంటూ ఓ సినిమాకు శ్రీకారం చుట్టాడు విజయ్ కాంత్.  ఇలా ఇది కాకపోతే అది.. అది కాపోతే ఇది అన్ట్ల్నట్లుగా రాజకీయాలు - సినిమాలు రెండు పడవలపై ప్రయాణిస్తున్న ఈ నేతలకు చివరికి ఏం మిగులుతుందో చూడాలి.
Tags:    

Similar News