రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పార్టీలకు చెందిన నేతలకు టెన్షన్ పుట్టిస్తున్నారు విజయమ్మ. తాజాగా ఆమె ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం కొమ్ములు తిరిగిన నేతలకు కొత్త సవాలుగా మారింది. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లుగా పరిస్థితి మారినట్లు చెబుతున్నారు. వైఎస్ మరణించే నాటికి ఉన్న మంత్రివర్గ సభ్యులతో కలిపి వైఎస్ 12వ వర్ధంతిని నిర్వహించాలని విజయమ్మ ప్లాన్ చేయటం తెలిసిందే.
ఓవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా.. ఆమె కూతురు తెలంగాణలో పార్టీ పెట్టిన వేళ.. వివిధ పార్టీల్లోని కీలక స్థానాల్లో ఉన్న వైఎస్ సహచరులు ఇప్పుడీ కార్యక్రమానికి వెళ్లాలా? వద్దా? అన్నది వారికిప్పుడు పెద్ద టెన్షన్ తెప్పిస్తోంది. ఎందుంటే.. వైఎస్ మంత్రివర్గంలోని పలువురు పలు పార్టీల్లోకి వెళ్లిపోవటం తెలిసిందే. వైఎస్ చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు తెలంగాణ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆయన మంత్రివర్గంలో మంత్రిగా వ్యవహరించిన రఘువీరా.. రాజకీయాలకు దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. మరో మంత్రిగా వ్యవహరించిన పితాని సత్యనారాయణ తెలుగుదేశంలో కీలకంగా మారారు. కోమటిరెడ్డి సోదరులు తెలంగాణ కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు.
ఇక.. ఆయనకు అత్యంత సన్నిహితులైన ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇలా ఎవరికి వారు.. వారి దారిన వారు ఉన్న వేళ.. విజయమ్మ నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లి.. వైఎస్ ను పొగిడితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి తోడు.. పన్నెండేళ్ల క్రితం నాటి పరిస్థితులకు.. నేటి పరిస్థితులకు ఏమాత్రం పోలికలేనట్లు మార్పులు చోటు చేసుకున్నాయి. అన్నింటికి మించి సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్న వేళ..కార్యక్రమానికి వెళితే ఒకలా.. వెళ్లకుండా మరోలాంటి ఇబ్బంది ఎదురవుతుందని భావిస్తున్నారు.
ఈ చిక్కుముడిని విడదీయటం నేతలకు ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. కార్యక్రమానికి హాజరు కాకుండా ఉండేందుకు ఉన్న అవకాశాల్ని వెతుకుతున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ అధికారపక్షంలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలు.. తమకు మెసేజ్ రూపంలో ఆహ్వానం వచ్చిందని.. విజయమ్మ నేరుగా ఫోన్ చేసి రావాలని చెప్పలేదని చెబుతున్నారు. ఫోన్ కు మెసేజ్ వచ్చి.. వ్యక్తిగతంగా ఫోన్లో రావాలని కోరితే ఇబ్బందికరంగా ఉంటుందని.. అదే మెసేజ్ కే పరిమితం కావటం మంచిదన్నారు. వైఎస్ తో తమకున్న అనుబంధాన్ని తెలియజేయటం ద్వారా ఇప్పటికిప్పుడు కలిగే ప్రయోజనం కంటే.. కష్టాలే ఎక్కువన్న మాట వినిపిస్తోంది.
అందుకే.. ప్రోగ్రాంకు వెళ్లకుండా ఉండటానికి మెసేజ్ మాత్రమే రావటాన్ని చూపించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. రానున్న రెండు రోజుల్లో విజయమ్మ ఫోన్ చేసి కార్యక్రమానికి రావాలని ఆహ్వానిస్తే మాత్రం తమ పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరే జరుగుతుందో చూడాలి.