విజయారెడ్డి హత్య : ఆ ఆడియో టేప్ లో ఏముందంటే ?

Update: 2019-11-05 12:30 GMT
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన అబ్దుల్లాపూర్‌ మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి దారుణ హత్య గురించే చర్చ నడుస్తుంది. నీతికి , నిజాయితీ కి కట్టుబడి పనిచేసిన ఒక లేడీ ఆఫీసర్ ని పట్టపగలే ఏ మాత్రం కనికరం లేకుండా సురేష్ అనే ఒక దుండగుడు పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఆమె చనిపోయింది అని నిర్దారించుకున్న తరువాత అక్కడి నుండి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణ హత్య జరిగిన తరువాత .. గౌరెల్లి గ్రామంలోని 412 ఎకరాల భూ వివాదం తెరపైకి వచ్చింది.  ప్రస్తుతం సంచలనం రేపుతున్న ఈ హత్య గురించి ఓ రాజకీయ నేత గౌరెల్లి గ్రామానికి చెందిన ఒక  రైతుతో మాట్లాడారు. వారిద్దరి సంభాషణకు సంబంధించిన ఆడియో  ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఆ భూములు ఇప్పటివి కావని , ఎప్పుడో  తాతల కాలం నాటివని.. అందులో 7 ఎకరాలు తహసీల్దార్‌ విజయారెడ్డిపై దాడికి పాల్పడ్డ సురేశ్‌ కుటుంబానికి చెందినవని గౌరెల్లి రైతు ఆ రాజకీయ నేతతో చెప్తున్నారు. ఇది రజకార్లు ఉన్నప్పుడు కొన్న భూమి అని, దీని కోసం దాదాపు 1950 నుంచి  కొట్లాడుతున్నామని తెలిపారు. అప్పటినుండి ఎంతోమంది ఈ భూములని  కాజేయాలని యత్నించారని ఆరోపించారు. ప్రభుత్వాలు మారిన సమస్య మాత్రం తీరలేదన్నారు.   ఇంకా ఆ రైతు మాట్లాడుతూ .. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్లు నకిలీ పత్రాలు సృష్టించి భూములు కాజేసేందుకు  ప్రయత్నించారని ఆరోపణలు చేశారు. ఈ భూముల కోసం రైతులు తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతుంటే ..  ఈ భూములు రైతులకు ఇప్పిస్తానని చెప్పి.. ఒక ప్రజా ప్రతినిధి వారి వద్ద నుంచి రూ. 30 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. ఆ రాబట్టిన మొత్తం లో ఇప్పుడు  హత్య చేసిన సురేశ్‌ కుటుంబానివి కూడా 2 నుంచి 3 లక్షల రూపాయలు ఉంటాయని చెప్పారు. అలాగే పై అధికారులకు కూడా అలా జరగాల్సిందేనని ఆ రైతు మాట్లాడారు.

ఇదే సందర్భంలో ఆ రాజకీయ నేత కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. మీ ఊర్లో లాగే ..పెద్ద అంబర్‌పేటలో కూడా ఇలాగే 402 ఎకరాల భూమి ఉందని, ఆ భూములని 1955లో అక్కడి రైతులు  కొనుగోలు చేశారని..1976 వరకు వారి పేర్లపైనే పట్టాలు ఉన్నాయని, ఆ తర్వాత పేరు మార్చారని ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉందని ఆ రాజకీయ నేత చెప్తున్నాడు. అలాగ ఓ ప్రముఖ నాయకుడి కుమారుడి ఈ వివాదం వెనుక ఉండి నడిపిస్తున్నాడని ఆరోపించారు. అయితే చివరగా వారు మాట్లాడుకుంటూ . ఈఘటనపై సీబీఐ విచారణ జరిగేలా రెండు గ్రామాల రైతులు పోరాటం  చేసేలా చూడాలని  వారిద్దరూ అనుకున్నారు.
Tags:    

Similar News