‘సర్జికల్ స్ట్రైక్స్’ మీరెందుకు ఉలిక్కిపడుతున్నారు? టీఆర్ ఎస్ - ఎంఐఎంపై రాములమ్మ ఫైర్
పాతబస్తీలో ఉన్న రోహింగ్యాలు, పాకిస్థాన్ వాళ్లను తరిమికొట్టేందుకు సర్జికల్ జరుపుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటే టీఆర్ఎస్, ఎంఐఎం ఎందుకు ఉలిక్కిపడుతున్నాయని కాంగ్రెస్ నేత విజయశాంతి ప్రశ్నించారు. ‘రోహింగ్యాలు పాతబస్తీలో లో ఉన్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలి. అంతేకాని బండిసంజయ్‌పై ఎదురుదాడికి దిగడంలో అర్థం లేదు. గతంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ అనేక సార్లు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారు. అప్పుడు టీఆర్ఎస్ ఎందుకు ఖండించలేదు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు రోజే అసదుద్దీన్ ప్రగతిభవన్‌కు వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. వీళ్లిద్దరూ మిత్రపక్షాలుగా కొనసాగుతున్నారు. మరి ఇప్పుడెందుకు డ్రామాలు ఆడుతున్నారు.
గతంలో అసదుద్దీన్ ఒక్క 15 నిమిషాలు పోలీసులు సైలెంట్‌గా ఉంటే మా సత్తా చూపుతానన్నాడు. మేం ఉమ్మేస్తే భాగ్యలక్ష్మి గుడి మునిగిపోతుందని వ్యాఖ్యానించాడు. హిందువులు పవిత్రంగా చూసే గోవును కూడా అవమానించేలా మాట్లాడాడు. అప్పుడు స్పందించని కేటీఆర్. ఇప్పుడెందుకు వచ్చాడు. ఈ ఎన్నికల ముందు ఎంఐఎంతో ఏ సంబంధం లేదన్నట్టు టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతుంది. వాళ్ల డ్రామాలను జనాలను నమ్మరు’ అంటూ విజయశాంతి ఘాటుగా ట్వీట్లు చేశారు.
విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికీ ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఆమె ప్రచారం చేయడం లేదు. త్వరలోనే విజయశాంతి బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో విజయశాంతి వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఇటీవల విజయశాంతి బీజేపీకి అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం ఆమె ఇంటికి వెళ్లి బుజ్జగించినప్పటికీ ఆమె మెత్తబడలేదు. తాజాగా బీజేపీకి బహిరంగంగానే మద్దతు తెలపడంతో ఆమె త్వరలోనే కాంగ్రెస్ వీడతారన్న వ్యాఖ్యలకు బలం చేకూరింది.