గతంలో తెలంగాణ ఉద్యమాన్ని బలపరచని హీరోలు, వాళ్ల సినిమాలను తను ఎప్పటికీ సమర్థించనని బీజేపీ నాయకురాలు విజయశాంతి హాట్ కామెంట్స్ చేశారు. గతంలో కొంత మంది హీరోలను పొగిడిన నోటీతోనే.. ఇప్పుడు విజయశాంతి తిడుతున్నారంటూ యూట్యూబ్ లో కొన్ని వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. వీటిపై సీరియస్ గా స్పందించారు విజయశాంతి.
సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని విజయశాంతి కొట్టిపారేశారు. విజయశాంతి రెండు నాల్కలతో వ్యవహరిస్తున్నారన్న విమర్శలను ఖండించారు. కొన్ని సందర్భాల్లో కొందరు నటులను మెచ్చుకున్నట్టు, అదే మరికొన్ని సందర్భాల్లో విమర్శించినట్టు తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని విజయశాంతి ఆరోపించారు. తప్పుడు ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె స్పష్టం చేశారు.
తను చెప్పాలనుకుంటున్న విషయాలను తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా సూటిగా చెబుతానని.. ఇతర మాధ్యమాల్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.
ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం విజయశాంతి విమర్శలు గుప్పించారు. గతంలో తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన హీరోలను కేసీఆర్ భయపెట్టి తన దారికి తెచ్చుకున్నారని.. తాను అలాంటి పనులు చేయనని విజయశాంతి స్పష్టం చేశారు.