కరోనాపై లేడీ సూపర్‌ స్టార్‌ సూచనలు వినండి..

Update: 2020-03-25 21:30 GMT
తెలుగు వారు ఎంతో ఘనంగా చేసుకునే ఉగాది పండుగ కరోనా పుణ్యమా అని కళ తప్పగా.. అయితే ఇంటిల్లిపాది మాత్రం కుటుంబసభ్యులతో గడుపుతుండడం విశేషం. కరోనా వైరస్‌ ప్రస్తుతం భారతదేశంలో సరికొత్త మార్పులను తీసుకొస్తోంది. ప్రపంచ దేశాలను కలవరం చేస్తున్న  కరోనా వైరస్‌ కోసం కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు సహకరించి జాగ్రత్తలు పాటించాలని - మనవంతు సహాయంగా ఇళ్లల్లోనే ఉందామని ఎంతో మంది ప్రముఖులు పిలుపునిస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు తోచిన విధంగా సలహాలు - సూచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా లేడీ సూపర్‌ స్టార్ - కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు విజయశాంతి తొలిసారిగా కరోనా వైరస్‌ పై స్పందించారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేస్తూ ట్విటర్‌ లో మెసేజ్‌ చేశారు. ఆమె ట్వీట్‌ ఈ విధంగా ఉంది.

‘ప్రభుత్వాలు - ప్రధానమంత్రి - ముఖ్యమంత్రులు లాక్‌ డౌన్‌ గురించి హెచ్చరిక స్వరంతో చేసిన విజ్ఞప్తిని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నా. లాక్‌ డౌన్‌ కు, కర్ఫ్యూకు నిర్ణయ వ్యత్యాసం మన ప్రజలపైనే ఆధారపడి నిర్దేశితమవుతుంది. దేశాన్ని మరింత సంక్లిష్టతకు గురిచేయవద్దు. మన వైద్య విభాగ పరిస్థితి - పరిమాణాల ప్రామాణికత - అంతర్జాతీయ స్థాయిలో లేదని గుర్తించండి. ప్రభుత్వాల అభ్యర్థనను అర్థం చేసుకుని ఆచరించండి. నా వంతుగా మీకు అవగాహన కల్పించేందుకు గత కొన్ని రోజులుగా నేను చేస్తున్న ఈ ప్రయత్నం ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటున్నా’ అని విజయశాంతి ట్వీట్‌ చేశారు.
 
Tags:    

Similar News