తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణించిన తర్వాత ఆ రాష్ట్రంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. జయ నేతృత్వంలో వరుసగా రెండో దఫా అధికారాన్ని దక్కించుకున్న అన్నాడీఎంకే... అలా సెకెండ్ టర్మ్ వరుసగా అధికారం చేజిక్కించుకున్న పార్టీగా 30 ఏళ్ల క్రితం నమోదైన రికార్డును బద్దలు కొట్టేసింది. అయితే అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరి సుదీర్ఘ కాలం పాటు చికిత్స అందించినా కోలుకోలేక జయ మరణించారు. ఆ మరుక్షణం నుంచే తమిళ రాజకీయాలు సరికొత్త మలుపు తిరిగాయని చెప్పాలి. అధికార అన్నాడీఎంకేను తన చేతి కిందకు తీసుకునేందుకు జయ నెచ్చెలి శశికళ చేసిన యత్నాలు - అప్పటిదాకా సీఎంగా ఉన్న పన్నీర్ సెల్వంకు దించేసి తనకు అనుకూలంగా ఉన్న ఎడప్పాడి పళనిసామిని గద్దెనెక్కించడం - అనూహ్యంగా ఆమె అవినీతి కేసులో జైలుకు వెళ్లడం వెంటవెంటనే జరిగిపోయాయి.
ఈ క్రమంలో తమిళ రాజకీయాలను ఏలిన వారంతా సినిమా వాళ్లేనన్న వాదనను వినిపించిన సూపర్ స్టార్ రజనీకాంత్ - మరో సీనియర్ నటుడు కమల్ హాసన్ లు రంగంలోకి దిగేశారు. ఎప్పటికప్పుడు ఈ విషయంపై రజనీ ఓ అడుగు ముందుకు - రెండు అడుగులు వెనక్కు అన్న చందంగా వ్యవహరిస్తుండగా, కమల్ హాసన్ మాత్రం చాలా డేరింగ్ గా తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమేనని ప్రకటించేశారు. అంతేకాకుండా... అవసరమనుకుంటే తాను బీజేపీతో కలిసే విషయంలో కూడా వెనుకంజ వేసేది లేదని కూడా కాస్తంత సంచలన ప్రకటనే చేశారు. అయితే జయ బతికుండానే రాజకీయాల్లోకి రావడమే కాకుండా సొంతంగా పార్టీని పెట్టుకుని అటు జయతో పాటు ఆ రాష్ట్ర మాజీ సీఎం కరుణానిధి నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షం డీఎంకేకు కూడా ముచ్చెమటలు పోయించిన నటుడు విజయకాంత్ మొన్నటిదాకా అసలు ఎక్కడున్నారో కూడా తెలియనీయ లేదు. మొన్నటి ఎన్నికల్లో తన పార్టీ డీఎండీకే ఘోర పరాజయం కాగా... ఏ ముఖం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్లాలా? అన్న దిగులుతో నిన్నటిదాకా విజయకాంత్ పత్తా లేకుండా పోయారనే చెప్పాలి.
అయితే తన రాజకీయ రంగ ప్రవేశంపై కమల్ హాసన్ నుంచి వరుసగా వస్తున్న ప్రకటనల నేపథ్యంలో ఎట్టకేలకు ఈ రోజు మధ్యాహ్నం బయటకు వచ్చిన విజయకాంత్.. కమల్ తో పాటు రజనీ రాజకీయ రంగ ప్రవేశంపై కాస్తంత ఘాటు వ్యాఖ్యలే చేశారు. జయలలిత బతికి ఉన్నప్పుడు కమల్ హాసన్ అవినీతిపై ఎందుకు నోరు మెదపలేదని ఆయన ప్రశ్నించారు. కమల్ - రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని, ఒకవేళ వారు రాజకీయ ఆరంగేట్రం చేస్తే ఎదుర్కొనేందుకు పలువురు సిద్ధంగా ఉన్నారన్నారు. అవినీతిపై మాట్లాడుతున్న సినీ నటులు కమల్ - విశాల్ మాజీ ముఖ్యమంత్రి జయలలిత బతికుండగా ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. జయ హయాంలో ధైర్యంగా అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పింది తానేనన్నారు.
డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి గతంలో లాగే ఆరోగ్యంగా ఉంటే ప్రస్తుత అధికార పార్టీ స్థితి మరోలా ఉండేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. డీఎంకే కార్యాచరణ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మెతకవైఖరితో ఏమీ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని విమర్శించారు. ఇక తన పార్టీ విషయాన్ని ప్రస్తావించిన విజయకాంత్... ఆవిర్భవించిన కొత్తలో విజయాలతో డీఎండీకే దూసుకుపోగా, ప్రస్తుతం పరాజయాలు ఎదుర్కొంటోందన్నారు. పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో అధిక స్థానాలలో విజయం సాధించేలా చర్యలు తీసుకుంటున్నామని విజయకాంత్ సెలవిచ్చారు. మరి విజయకాంత్ ప్రకటనపై కమల్ - స్టాలిన్ లు ఏమంటారో చూడాలి.