రాజకీయాల గురించి పెద్దగా పెదవి విప్పకుండా ఉంటున్న మాజీ కేంద్రమంత్రి చిరంజీవి తాజాగా పెదవి విప్పటం తెలిసిందే. తాజాగా ఆయన చేసిన ప్రతిపాదనపై ఆయనకు అనుకోని మద్దతు లభించటం విశేషం. రాజకీయంగా భిన్నధ్రువాలుగా వ్యవహరించే విజయశాంతి చిరంజీవి మాటకు వత్తాసు పలకటం తాజా విశేషం.
ఏపీలో కాపుల్ని బీసీల్లో చేర్చాలంటూ కాపు ఐక్య గర్జన చేప్టటటం.. అదికాస్తా హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంతో కాపుల్ని బీసీల్లో చేర్చాలన్న డిమాండ్ ఇప్పుడు ప్రముఖంగా మారిపోయింది. ఇదే సమయంలో కాపు సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి ఈ ఘటన మీద ఆచితూచి స్పందిస్తూ.. కాపుల్ని బీసీల్లో చేర్చేలా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలంటూ చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. తాజాగా ఆయన రాసిన లేఖపై విజయశాంతి రియాక్ట్ అయ్యారు.
చిరంజీవి ప్రతిపాదన సమంజసంగా ఉందని.. కాపుల రిజర్వేషన్ల విషయంలో ఆయన అభిప్రాయం సరైనదంటూ మద్దతు పలుకుతూ వ్యాఖ్యానించారు. రాజకీయంగా చిరు తీసుకున్న ఏ నిర్ణయంపై స్పందించని.. విజయశాంతి చిరుకు దన్నుగా గళం విప్పటం గమనార్హం.