వినుకొండ గ్రౌండ్ రిపొర్ట్

Update: 2019-03-17 06:43 GMT
ఎన్నికలు మరెన్నో రోజులు లేవు. ఈ పార్టీ గెలుస్తుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఇటు చంద్రబాబు అయినా అటు జగన్ అయినా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామంటున్నారు.

వివిధ సర్వే రిపోర్టుల్లో అన్ని రొజుకకటి బయటకు వస్తున్నాయి.  గుంటూరు జిల్లా వినుగొండ నియోజకవర్గం పై గ్రౌండ్ రిపోర్ట్ ను పరిశీలించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక పరిస్థితుల ప్రకారం.. వైఎస్ఆర్  సీపీ అభ్యర్థికే ప్రజలు పట్టం కట్టేలా ఉన్నారు.   

వినుకొండ నియోజకవర్గంలో ఫ్యాన్ గాలి బాగా వీస్తోంది. ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి వైసీపీ లోకి వచ్చిన వారి సంఖ్య 10వేలకు చేరింది. మరో 5 వేల మంది చేరటానికి తేది నిర్ణయించుకున్నారని సమాచారం. రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గంలోనూ ఇన్ని చేరికలు కాలేదు.

ఇటీవల జరిగిన పలు సర్వేలలో కూడా వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడుకి అనుకూలంగా రావటంతో వలసలు మరింత ఎక్కువుగా ఉన్నాయి. దీనికి తోడు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు వైసీపీలో చేరటానికి నిర్ణయించుకోవడంతో ఇప్పుడు అందరూ బొల్లా కి ఎంత మెజారిటీ రావచ్చనే లెక్కల్లో మునిగిపోయారు.

గడచిన ఐదేళ్లలో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వైఖరితో, జన్మభూమి కమిటీలతో టీడీపీ కార్యకర్తలు నిరాదరణకు గురై, విసిగి వేసారిపోయారని సమాచారం. ఇటీవల వైసీపీ తీర్ధం పుచ్చుకున్న టీడీపీ కార్యకర్తలు, పలువురు నాయకులు ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు.  నియోజకవర్గంలో విచ్చలవిడిగా వందల కోట్లలో జరిగిన అవినీతి, భూకబ్జాలు, చెరువుల కబ్జాలు, స్మశానాల కబ్జాలు, ఇసుక మాఫియాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

జీవీ ఆంజనేయులు రాజకీయాన్ని డబ్బుతో ముడి వేశారని, అన్ని వ్యవస్థల్ని నాశనం చేసారని, అభివృద్ధిలో వినుకొండ 20 ఏళ్ళు వెనక్కి వెల్లిందని ఇటీవల పార్టీమారిన ముఖ్యనాయకుడు లాయర్ ఎంఎన్ ప్రసాద్ ఆరోపించారు. అవకాశం ఉన్నా కానీ తాగు నీటి సమస్యను పరిష్కరించలేదని ప్రజలందరూ ఆగ్రహంగా ఉన్నారు. ఇవన్నీ వైసీపీ కి సానుకూలంగా మారాయి. వరికపూడిశాల ప్రాజెక్ట్, గుండ్లకమ్మ డామ్, సింగర్ చెరువు/దొండపాడు చెరువు నీటి నిల్వ ప్రాజెక్ట్ లతో నీటి సమస్యకు పరిష్కార మార్గాలతో బొల్లా ప్రజల్లోకి వెళ్ళేసరికి పార్టీలకతీతంగా నియోజకవర్గ ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. బొల్లాపల్లి మండలంలో మూడు రోజులకొకసారి స్నానం చేసే పరిస్థితి, చుట్టాలు ఇంటికి వస్తే గుక్కెడు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. బొల్లా బ్రహ్మనాయుడు తన సొంత ఖర్చులతో 16 ట్యాంకర్లు ఏర్పాటు చేసి, నీళ్లు అందిస్తున్నారు.

ఇటీవల దాదాపు వెయ్యిమందిని వీడియో ఇంటర్వ్యూ చేసిన టీం చెప్పిన దాని ప్రకారం, ఇక్కడ రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని, ఐదేళ్లుగా ఒక్క పంట కూడా వేయలేని పరిస్థితుల్లో ఉన్న రైతులు రుణ మాఫీ కాక తీవ్ర ఆగ్రంహంతో ఉన్నారు. బొల్లా విజయం నియోజకవర్గ అవసరంగా మెజారిటీ ప్రజా సంఘాలు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, యూత్ ఫీల్ అవుతున్నట్లుగా వాళ్ళు చెప్పారు. మొత్తంగా చూసుకుంటే ఈ సారి వినుకొండ ప్రజలు మాత్రం బ్రహ్మనాయుడుకి ఒక్క అవకాశం ఇద్దాం అంటున్నారు.
Tags:    

Similar News