వైరల్: తప్ప తాగి రెచ్చిపోయిన యువతి.. పోలీసులకే బెదిరింపు

Update: 2022-06-21 07:30 GMT
మద్యం తాగి వాహనం నడపడమే నేరం. కానీ ఈ యువతి ఏకంగా తప్ప తాగి నడిరోడ్డుపై హల్ చల్ చేసింది. ఏకంగా పోలీసుల కాలర్ పెట్టి షాకిచ్చింది. ఎంతో మంది జనాలు ఇప్పుడు పార్టీలు, ఫంక్షన్లు అంటూ తాగి ఊగుతున్నారు.

కానీ ఈ లేడీ ఏకంగా నడిరోడ్డుపైనే దుకాణం పెట్టి అందరికీ షాకిచ్చింది. డ్రంకెన్ డ్రైవ్ పేరిట ఎన్ని తనిఖీలు చేసినా మందుబాబులు మారడం లేదు. ఇప్పుడు మందు భామలు కూడా తాగి ఊగుతుండడం గమనార్హం.
 
ఒక మహిళ తప్పతాగి ముంబై వీధుల్లో హల్ చల్ చేసిన వైనం అందరినీ షాక్ కు గురిచేసింది. ముంబైలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పూర్తిగా మద్యం మత్తులో ఉన్న ఓ మహిళను పోలీసులు అడ్డుకున్నారు. ఆమె కారు దిగి పెద్ద సీన్ క్రియేట్ చేసింది.

ఆమె రోడ్డుపై పడుకుంది. విచిత్రమైన చర్యలు చేయకుండా పోలీసులు ఆమెను ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఆమె పోలీస్ పైనే అతని చొక్కా పట్టుకుని తన్నడానికి కూడా వెళ్ళింది. ఆమె అన్‌పార్లమెంటరీ భాషలో పోలీసులను తిట్టిపోసింది. పోలీసు ధరించిన ముసుగును కూడా తీసివేసింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమె చర్యలపై విమర్శలు.. ఫన్నీ కామెంట్‌లు కూడా చేస్తున్నారు. మద్యం తాగితే  మనిషిగా కనిపించడం లేదని.. సీన్ పూర్తి భిన్నంగా ఉండేదని చెబుతున్నారు.

ఇంత జరుగుతున్నా ఆ పోలీస్ అధికారి ఆమెను ఏం అనలేదు.. మహిళ కావడంతో అతడు సైలెంట్ గా ఉన్నాడు. యువతి మీదమీదకు వస్తుంటే ఆమెను దూరంగా పెట్టాడు. యువతి ప్రవర్తిస్తున్న తీరును కొంతమంది తమ సెల్ ఫోన్ లో రికార్డు చేసి వైరల్ చేయడంతో అది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Full ViewFull View
Tags:    

Similar News