ఇండియాలోనే నెంబర్-1 సెల‌బ్రిటీగా విరాట్‌ కోహ్లీ!

Update: 2021-04-01 15:30 GMT
టీమిండియా కెప్టెన్ మ‌రోసారి త‌న స‌త్తా చాటాడు. మైదానంలో త‌న‌దైన బ్యాటింగ్ తో మోతెక్కించే కోహ్లీ.. ఇటు బ్రాండింగ్ లోనూ దుమ్ము లేపుతున్నాడు. డ‌ఫ్ & ఫెల్ఫ్స్ అనే సంస్థ 2020 సంవ‌త్స‌రానికి గానూ ఇండియాలో మోస్ట్ బ్రాండ్ వ్యాల్యూ క‌లిగిన సెల‌బ్రిటీస్ జాబితా రిలీజ్ చేసింది.

ఇందులో కోహ్లీ వ‌రుస‌గా నాలుగో సంవ‌త్స‌రంలోనూ మొద‌టి స్థానిలో నిలిచాడు. క‌రోనా కండీష‌న్స్ లోనూ 237.7 మిలియ‌న్ డాల‌ర్ల వార్షిక ఆదాయం క‌లిగిన ఇండియ‌న్ సెల‌బ్రిటీగా రికార్డు సృష్టించాడు. కోహ్లీ ఎన్నో బ్రాండ్ల‌కు అంబాసిడ‌ర్ గా ఉన్నారు. విక్స్ నుంచి మాన్య‌వ‌ర్ దుస్తుల వ‌ర‌కూ చాలా కంపెనీల‌కు ఆయ‌న ప్ర‌చార క‌ర్త‌గా ఉన్నారు.

ఆయ‌న త‌ర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ నిలిచారు. 118 మిలియ‌న్ డాల‌ర్ల‌తో ఆయ‌న రెండో స్థానం సాధించారు. మూడో స్థానంలో ఫ్యాష‌న్ రారాజు ర‌ణ్ వీర్ సింగ్ నిలిచారు. ఆయ‌న బ్రాండ్ విలువ 102.9 మిలియ‌న్ డాల‌ర్లుగా జాబితా అనౌన్స్ చేసింది. టాప్ ఫైవ్ లో వీరు ముగ్గురితోపాటు షారూక్ ఖాన్, దీపికా ప‌దుకొణె ఉన్నారు.

ఆయుష్మాన్ ఖురానా, టైగ‌ర్ ష్రాఫ్‌, రోహిత్ శ‌ర్మ వ‌రుస‌గా.. 6, 15, 17 స్థానాల్లో నిలిచారు. కార్తీక్ ఆర్య‌న్ 20వ స్థానం సంపాదించారు. వారు వారు ప్ర‌చారం చేస్తున్న ఐట‌మ్, ఎండార్స్ మెంట్ పోర్ట్ ఫోలియో నుంచి సేక‌రించిన స‌మాచారం మేర‌కు ఈ విలువ‌ను నిర్ధారించిన‌ట్టు సంస్థ ప్ర‌క‌టించింది.
Tags:    

Similar News