బాహ్యప్రపంచానికి ముఖం చూపించకుండా ప్రైవసీ అంటూ దాచేసిన విరాట్ కోహ్లీ కూతురు ఫొటో ఎట్టకేలకు బయటకు వచ్చింది. కోడిపిల్లను దాచేసినట్టుగా విరాట్ కోహ్లీ, అనుష్క తమ కూతురు వామికను మీడియా కంట పడకుండా జాగ్రత్తగా దాచేశారు. అయితే ఎట్టకేలకు వామిక ఫొటో బయటకు వచ్చింది. విరాట్ కోహ్లి - అనుష్క శర్మ కుమార్తె వామిక తన తండ్రితో కలిసి దక్షిణాఫ్రికాలో జరుగుతున్న సిరీస్ కోసం వెళ్లారు. తాజాగా విరాట్ హాఫ్ సెంచరీ చేయడంతో బాల్కనీలో తల్లి అనుష్కతోపాటు వామిక చప్పట్లు కొట్టింది. దాన్ని కెమెరాలు ప్రసారం చేయడంతో వామిక ఫొటో బయటకు వచ్చింది. స్టాండ్స్‌లో అనుష్క వామికను పట్టుకున్నట్లు చూడవచ్చు. కెమెరామెన్ లు దాన్నే ఫోకస్ చేయడంతో చాలా మంది నెటిజన్లు ఇంటర్నెట్‌లో లీక్ అయిన క్షణాన్ని పంచుకున్నారు.
మ్యాచ్‌ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో అనుష్క చేతుల్లో పసిపాప ఉంది. గతంలో విరాట్ -అనుష్క ఇద్దరూ వామిక ఫొటోలు బయటకు రాకుండా దాచేశారు. ఇతరులు తమ గోప్యతను గౌరవించాలని అభ్యర్థించారు. వారి బహిరంగ ప్రదర్శనలపై వామికాను క్లిక్ చేయవద్దని కోరారు. వామిక ముఖం కనిపించకుండా దాచేశారు. ఆమె ముఖాన్ని చిత్రాలలో చాలాసార్లు అస్పష్టం చేశాయి.
అయితే ఈ సమయంలో మ్యాచ్ లో వామిక కనిపించడంతో ఇంటర్నెట్ వినియోగదారులు మొదటిసారి వామిక ముఖాన్ని బహిర్గతం చేస్తూ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేసారు. వామిక చాలా అందంగా కనిపించడమే కాదు, అక్షరాలా విరాట్ కోహ్లీ జిరాక్స్ కాపీలా ఉంది. ఆమె చిత్రాన్ని విరాట్ చిన్ననాటి చిత్రంతో పోల్చినప్పుడు నమ్మడం చాలా కష్టం. ఇద్దరూ సేమ్ యాజ్ టీజ్ గా ఉన్నారు. నిస్సందేహంగా మంచి లుక్స్ తో కనిపిస్తోంది. విరాట్ పోలికే వామికకు వచ్చింది.
అనుష్క శర్మ -విరాట్ కోహ్లీ అభిమానులు మాత్రం వామిక పోస్ట్‌ను తొలగించాలని ట్విట్టర్‌లో కోరుతున్నారు. ఇటీవల అనుష్క తమ కుమార్తె వామిక చిత్రాలను క్లిక్ చేయనందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక గమనికను రాసింది. “వామికా చిత్రాలు/వీడియోలను ప్రచురించనందుకు భారతీయ ఛాయాచిత్రకారులు - చాలా మంది మీడియా సోదరులకు మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తల్లిదండ్రులుగా, చిత్రాలు/వీడియోను తీసుకువెళ్లిన కొద్దిమందికి మా అభ్యర్థన ఏమిటంటే, మా నిర్ణయానికి మాకు మద్దతు ఇవ్వమని కోరుతున్నాం. మేము మా బిడ్డ కోసం గోప్యతను కోరుకుంటాము. మీడియా -సోషల్ మీడియాకు దూరంగా తన జీవితాన్ని స్వేచ్ఛగా జీవించే అవకాశాన్ని ఆమెకు అందించడానికి మా వంతు కృషి చేయాలనుకుంటున్నాము” అని వామిక ఫొటోలు బయటపెట్టవద్దని కోరింది.
ఇలా చాలా రోజులుగా దాచేసిన వామిక ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. అయితే అన్యాపదేశంగా కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడంతో కూతురుతోపాటు బయటకు వచ్చి అనుష్క రివీల్ చేసింది. లేదంటే వామిక చిత్రాలు బయటకు వచ్చేవి కాదు.. ఏదైతేనేమీ.. వామిక అచ్చం నాన్న పోలిక అన్న సంగతి తెలిసివచ్చింది.