మహమ్మారి కోరలు చాస్తోంది.. విశృంఖలంగా వ్యాపిస్తోంది. ఏపీలో తాజాగా హైకోర్టు వరకు చేరింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు, ఉన్నతాధికారులకు వెలుగుచూసిన కరోనా తాజాగా రాష్ట్ర హైకోర్టు లోని సిబ్బంది కి సోకడం కలకలం రేపింది. తద్వారా పిటీషన్లు కూడా వాయిదా పడిన వైనం నెలకొంది.
ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు లో పని చేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు బుధవారం హై కోర్టు కార్యకలాపాలు రద్దు చేస్తున్నట్టు రిజిస్ట్రార్ ప్రకటించారు.
ఇక హైకోర్టు పరిధి లోని అన్ని దిగువ కోర్టుల్లో కూడా కార్యకలాపాలు రద్దు చేస్తున్నట్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అత్యవసర పిటీషన్లను ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
దీంతో మహమ్మారి ఎఫెక్ట్ తో ఏపీలో న్యాయ వ్యవస్థపై ప్రభావం పడినట్టైంది. కొద్దిరోజుల వరకు కోర్టుల కార్యకలాపాలకు విఘాతం కలగనుంది.