మహమ్మారి ఒక్కో దేశాన్ని ఊడ్చేస్తూ వెళుతోంది. మొన్న ఇటలీ.. నిన్న అమెరికా.. నేడు దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్. ఇలా కాదేది కరోనాకు అనర్హం అన్నట్టుగా పరిస్థితి మారింది.
మహమ్మారి బ్రెజిల్ దేశంలో అల్లకల్లోలం సృష్టించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాగే బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కూడా వైరస్ ను తేలిగ్గా తీసుకోవడంతో మహమ్మారి దేశంలో బాగా విస్తరించి చాలా మంది ప్రజల ప్రాణాలు తీస్తోంది.
బ్రెజిల్ లో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికే అక్కడ వేల సంఖ్యలో ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. మృతులు కూడా ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మృతదేహాలను కుటుంబసభ్యులు తీసుకెళ్లలేక పోవడంతో సామూహిక ఖననాలకు ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. సావో పోలో నగరంలోని ఫార్మోసాలో ఏకంగా 13వేల సమాధులను సిద్ధం చేసింది.
ఈ సమాధులను తాజాగా డ్రోన్ నుంచి ఫొటోలు, వీడియోలు తీయగా అవి ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. బ్రెజిల్ లో మహమ్మారి తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఈ ఫొటోలు తేటతెల్లం చేశాయి.
ఈ మహమ్మారి బ్రెజిల్ లో విజృంభిస్తోంది. రోజూ వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. సావోపాలో నగరంలోని విలా ఫార్మోసా శ్మశానంలో 13వేల సమాధులు సిద్ధం అయ్యాయి. వైరస్ తో చనిపోయిన వారిని సామూహికంగా ఖననం చేస్తున్నారు. అధ్యక్షుడు జైర్ బోల్సోనారో వైరస్ ను తేలిగ్గా తీసుకోవడం పై బ్రెజిల్ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చైనా ను మించి ఇక్కడ కేసులు, మరణాలు సంభవించడం పై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.