కోలుకున్నా వదలని వైరస్! డిఫ్రెషన్ లేదా స్ట్రోక్ వచ్చే ఛాన్స్!

Update: 2021-01-26 12:30 GMT
మన దేశంలో కరోనా ప్రబలిన కొత్తలో పాజిటివ్ కేసుల సంఖ్య  విపరీతంగా నమోదైంది. కరోనా కేసుల సంఖ్యలో మన దేశం అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉంది. దేశంలో కరోనాతో సంభవించిన మరణాలు మాత్రం ఇతర దేశాలతో పోలిస్తే తక్కువే. అయితే ఇప్పుడు కరోనా బారిన పడి కోలుకున్న వారు కొత్త కొత్త రుగ్మతల బారిన పడుతున్నట్లు తాజా అధ్యయనం తేల్చింది. కరోనా నుంచి కోలుకున్నవారు ఎక్కువగా మానసిక, లేదా నాడీ సంబంధిత సమస్యలతో ఎక్కువగా బాధ పడుతున్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. కరోనా సోకిన ప్రతి ఎనిమిది మందిలో ఒకరు వైరస్ సోకిన ఆరు నెలల్లోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు.

కరోనా సోకిన ప్రతి తొమ్మిది మందిలో ఒకరు డిఫ్రెషన్, లేదా స్ట్రోక్ వంటి సమస్యలతో బాధ పడుతున్నట్లు తేలింది. కరోనా బారిన పడి కోలుకున్న వారితో పాటు కోవిడ్ తో ఆస్పత్రిలో చేరిన 2,36,379 హెల్త్ రికార్డ్ లను శాస్త్రవేత్తలు పరిశీలించారు. వీరి డేటాను ఇన్ఫ్లు ఎంజా బాధితులతో పోల్చి చూసారు. కరోనా నుంచి కోలుకున్నాక ఆరు నెలల్లో నాడీ లేదా మానసిక సమస్యల బారిన పడ్డవారు 33.6 శాతంగా ఉన్నట్లు గుర్తించారు. కరోనా సోకి కోలుకున్న ఐదుగురిలో ఒకరు మూడు నెలల్లోనే మానసిక సమస్యలతో బాధ పడుతున్నట్లు పరిశోధకులు తేల్చారు.

కరోనా సోకి కోలుకున్నవారిలో బ్రెయిన్ స్ట్రోక్, మెదడులో రక్త స్రావం, మతి మరుపు, శ్వాస కోస ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లు ఎంజా, మానసిక రుగ్మతలు సర్వ సాధారణంగా తలెత్తుతాయని పరిశోధకులు గుర్తించారు. కరోనా సోకడం వల్ల ఏం జరుగుతుందోనన్న ఆందోళనతోనే  మానసిక రుగ్మతలు, స్ట్రోక్ వంటి సమస్యలు అధికంగా తలెత్తుతున్నట్లు  వైద్య నిపుణుల పరిశోధనలో  తేలింది.
Tags:    

Similar News