ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. విశాఖలోని కింగ్ జార్జ్ (కేజీహెచ్) ఆసుపత్రిలో బెడ్స్ కొరత ఉన్నట్లుగా సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇంతకు ముందు వైద్య ఆరోగ్య శాఖను తమ పార్టీకి చెందిన మంత్రి కామినేని శ్రీనివాసరావు నిర్వహించేవారని.. ఇప్పుడు సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఇప్పటికైనా కేజీహెచ్ ఆసుపత్రిలో మార్పు రావాలన్నారు. విశాఖ నగరంలో ఇప్పుడున్న జనాభాకు ఏ మాత్రం సరిపోవటం లేదన్నారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని.. ఆ విషయాన్ని తాను నాలుగేళ్లుగా చెబుతున్నా ఏ మాత్రం మార్పురాలేదన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ విశాఖపట్నం వస్తుంటారని.. అది తమకు సంతోషమేనని.. ఒకసారి కేజీహెచ్ ఆసుపత్రిని సందర్శిస్తే మంచిదన్నారు. ఈ సందర్భంగా అక్కడున్న సెంటిమెంట్ గురించి ఆయన చెప్పారు. ఆసుపత్రిలో రాత్రివేళ బస చేసిన నేతల పదవులు పోతాయని.. ఆ విషయాన్ని తాను గతంలో కామినేని శ్రీనివాస్ కు చెప్పి బస చేయొద్దని చెప్పినట్లు చెప్పారు. అయినా.. వినకుండా కామినేని బస చేశారని.. ఆ తర్వాత ఆయన పదవి పోయిందన్నారు.
అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు కేజీహెచ్ లో బస చేయాల్సిన అవసరం లేదని.. కేవలం విజిట్ చేస్తే బాగుంటుందన్నారు. ఆయన విజిట్ చేస్తే ఆసుపత్రి స్వరూపం మారిపోతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి.. విష్ణుకుమార్ మాటను బాబు ఏం చేస్తారో చూడాలి.