ఏపీ అధికారపక్షానికి మిత్రపక్షంగా వ్యవహరించే బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు తీరు కాస్త భిన్నం. పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ.. తన తీరుతో అధికారపక్షానికి ఇబ్బందికరంగా మాట్లాడటానికి అస్సలు వెనుకాడరు. ధర్మం చెప్పాల్సి వస్తే.. అధికారపక్షం చేసే తప్పుల్ని సైతం వేలెత్తి చూపించేస్తుఆంటారు. అందుకు ఏ మాత్రం మొహమాటం పడని తీరు ఆయనలో కనిపిస్తుంటుంది. గడిచిన కొద్దిరోజులుగా విశాఖ శివారు ప్రాంతంలో భారీగా చోటు చేసుకుంటున్న భూకుంభకోణాలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ నగరంలో భూకబ్జా చాలా తీవ్రంగా ఉందన్నారు. భీమిలి చుట్టూ భారీగా భూకుంభకోణాలు జరుగుతున్నాయన్నారు. జిల్లా అంతటా ఆక్రమణలు ఉన్నా.. భీమిలిలో భూదందా పతాక స్థాయికి చేరిందన్న ఆయన.. తాను కానీ హోం మంత్రిని అయితే విశాఖ జిల్లాలో భూకబ్జాదారుల తొక్క తీస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
విశాఖలోని భీమిలి ప్రాంతంలో భూ కుంభకోణాలు జరుగుతున్నా.. ఎవరూ పెద్దవాళ్ల పేర్లు బయటకు చెప్పటం లేదన్నారు. పక్కా ఆధారాలు లేవు కాబట్టే తాను సైతం పేర్లు బయటకు చెప్పటం లేదని.. అయితే.. ఆక్రమాలు జరిగిన మాట వాస్తవమన్నారు. సీబీఐ విచారణ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.
వందల కోట్ల రూపాయిల భూ కుంభకోణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని.. ఈ భూకుంభకోణాల గురించి తాను ఎన్నిసార్లు మెత్తుకుంటున్నా.. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదో అర్థం కావటం లేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అధికారుల్లో కొందరు అవినీతిపరులు ఉన్నప్పటికీ.. రాజకీయ నేతల అండ లేకుండా రికార్డుల్ని ట్యాంపరింగ్ చేసేంత ధైర్యం వారికి ఉండదని చెబుతున్నారు విష్ణుకుమార్ రాజు. విశాఖను అలా చేస్తాం.. ఇలా చేస్తామని చెప్పే ఏపీ సర్కారు.. భూకుంభకోణాల విషయంలో మిత్రపక్షానికి చెందిన నేత అదే పనిగా నెత్తినోరూ కొట్టుకుంటున్నా.. ఎందుకు రియాక్ట్ కావటం లేదన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/