బాబుది కాపీ ఉద్య‌మం...జ‌గ‌న్ ఏం చేస్తే అదే

Update: 2018-05-02 16:11 GMT
బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై మండిప‌డ్డారు. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసినట్లే.. చంద్రబాబు చేస్తున్నారంటూ తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని.. వైసీపీ గ్రాఫ్ పెరుగుతోందని ఆయ‌న పేర్కొన్నారు. చంద్రబాబు చేసింది ధర్మపోరాట దీక్ష కాదని.. అధర్మ పోరాటం అన్నారు. వెంకన్న పాదాల చెంత మోడీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నామని విష్ణుకుమార్ రాజు అన్నారు. చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నారన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ఖాయమన్నారు. తిరుపతి ప్రెస్‌ క్లబ్‌ లో విష్ణుకుమార్‌ రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు తన స్థాయికి తగ్గ మాటలు మాట్లాడటం లేదని అన్నారు. వెన్నుపోటు రాజకీయాల్లో చంద్రబాబు ఆరితేరార‌ని, ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులు తీసుకోకుండా యూటర్న్‌ తీసుకున్న ఆయన బీజేపీకి వెన్నుపోటు పొడిచార‌ని మండిప‌డ్డారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీకి ప్రత్యేక హోదా కోసం అంటూ చేస్తున్నది అంతా అధర్మపోరాటం విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏం చేస్తే చంద్రబాబు అదే చేస్తున్నారంటూ సెటైర్లు వేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తులేకుండా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ పతనం ఖాయమని విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందన్న ఆయన… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందన్నారు. దేశంలో 10 రాష్ట్రాలకు హోదా ఇచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చిందిలేని వెల్లడించారు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు… ఆదినుంచి ప్రత్యేక హోదా కోసం జగన్ ఫైట్ చేస్తున్నారని ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారని ఆరోపించారు. జగన్ ఏది చేస్తే చంద్రబాబు అది చేస్తున్నారని… ఆయన కాపీ ఉద్యమమని  విష్ణుకుమార్ రాజు సెటైర్లు వేశారు. 2019 ఎన్నికల్లో పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని విష్ణుకుమార్ రాజు ప్ర‌క‌టించారు. `చంద్రబాబు సైకోసిస్‌ వ్యాధితో బాధపడుతున్నారు. ఆ వ్యాధి వల్లే బ్రిటిష్‌ వారితో టీడీపీ పోరాటం చేసిందంటూ తిరుపతి సభలో చెప్పారు. అన్ని వర్గాలను మభ్యపెడుతున్న చంద్రబాబు ఇప్పుడు బీజేపీని విలన్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.` అంటూ విరుచుకుప‌డ్డారు.

Tags:    

Similar News