ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు - రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలపై...మిత్రపక్షం ఎమ్మెల్యేనే షాక్ అయ్యారు. పరిస్థితులు ఒకలా ఉంటే..లోకేష్ ఇంకోలా ప్రకటనలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్లలో 10లక్షల ఐటీ ఉద్యోగాలు ఇస్తామని మంత్రి లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే - ఆ పార్టీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఆశ్చర్యానికి గురయ్యారు. ఒకవైపు ఐటీ పరిశ్రమలో ఉద్యోగాలు ఇబ్బందుల్లో పడితే... చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని అవినీతి - శాంతిభద్రతల తీరుపై బీజపీ ఫ్లోర్ లీడర్ విమర్శలు చేశారు. అవినీతి - రౌడీయిజం వల్లే రాష్ట్రంలో ఇసుక ధరలు పెరిగాయని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. విచ్చలవిడిగా ఇసుకదందా జరుగుతుంటే దానిపై తగిన చర్యలు తీసుకోకపోవడం సరికాదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఏపీ సర్కారు మద్యం పాలసీపై కూడా మిత్రపక్ష ఎమ్మెల్యే అయిన విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. భూమిపై స్థలం లేకుంటే సముద్రంలో కూడా మద్యం దుకాణం పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం విధానం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. విశాఖలో తహసీల్దార్ - ఆర్ అండ్ బీ ఈఎన్ సీపై ఏసీబీ సోదాలు జరిపించానని - వందల కోట్ల అవినీతి సొమ్మును జప్తు చేయించానని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వివరించారు. రాష్ట్రంలో రైతులకు పగటి పూటే 10 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.