కరోనా ఇంతలా విరుచుకుపడుతున్న వేళ.. పెళ్లిళ్లు.. వేడుకలు చేసుకునే పరిస్థితి లేదు. ఒకవేళ ముందే డిసైడ్ అయినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాయిదా వేసుకోవటం.. కాదనుకుంటే గుట్టుగా మమ అనిపించేస్తున్న పరిస్థితి. అందుకు భిన్నంగా ఒక మోస్తరు భారీతనంతోనే పెళ్లి చేసుకున్నారు బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా. తమిళ నటుడు విష్ణు విశాల్ తో ఆమె పరిచయం.. ఆ తర్వాత ప్రేమగా మారటం.. ఇరువురి మధ్య డేటింగ్ నడిచినట్లుగా వార్తలు వచ్చాయి.
అనుకున్నట్లే రెండు కుటుంబాల అంగీకారంతో వారు పెళ్లి చేసుకున్నారు. వారి వివాహ మహోత్సవం గురువారం మొయినాబాద్ లో జరిగింది. ఈ వివాహ వేడుకకు ప్రముఖులు.. సెలబ్రిటీలు.. పేజ్ త్రీతో పాటు.. కుటుంబ సభ్యులు.. బంధువులు.. స్నేహితులు హాజరయ్యారు. భారీగా కేసులు పెరిగిపోతున్న ఈ వేళలో.. ఇంత వేడుకగా వివాహ వేడుక చేసుకోవటం అవసరమా? అన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఒకరు హాజరయ్యారు.
ఒక క్రీడాకారిణి పెళ్లికి వెళ్లటం తప్పేం కాదు. కానీ.. తనతో పాటు దాదాపు మూడు.. నాలుగుకార్లలో మందిని తీసుకెళ్లి హడావుడి చేసిన వైనం షాకింగ్ గా మారింది. మామూలు రోజుల్లో ఇలాంటి వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న కరోనాపరిస్థితుల్లో ఇంతటి హడావుడి.. ఆడంబరం అవసరమా? అన్నది ప్రశ్నగా మారింది.