కేటీఆర్ అనుచరుడికి చుక్కలేనట..

Update: 2018-10-11 05:57 GMT
వ్రతం చెడినా ఫలితం దక్కేలా లేదట.. కేటీఆర్ కు అనుంగ శిష్యుడు - నమ్మిన బంటు అయిన ఎంపీ బాల్క సుమన్ కు అసమ్మతి రేగినా కేటీఆర్ చెన్నూర్ టికెట్ ఇప్పించ్చుకున్నాడు. చెన్నూర్ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును పక్కనపెట్టి మరీ ఈ సాహసానికి పాల్పడ్డారు. దీనిపై నల్లాల ఓదెలు తీవ్ర నిరసన చేపట్టి.. గట్టయ్య అనే కార్యకర్త ఆత్మహత్య దాకా పరిణామాలు సాగాయి. అనంతరం ఓదెలును పిలిపించి కేసీఆర్ బుజ్జగించడంతో పరిస్థితి చల్లబడింది.

కాగా ఇప్పుడు అంతా సద్దుమణిగిందనుకుంటున్న సమయంలో సీనియర్ నేత కాకా కుమారులు మాజీ ఎంపీ వివేక్ - మాజీ మంత్రి వినోద్ లు .. చెన్నూర్ టికెట్ తమకే కావాలంటున్నారు. వేల కోట్ల అధిపతులు - వ్యాపారసామ్రాజ్యం.. అంతకుమించిన రాజకీయ నేపథ్యం ఉన్నా వీరికి అసెంబ్లీ టికెట్ మాత్రం దక్కలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా వినోద్ కు చెన్నూర్ టికెట్ కోసం చాలా ఒత్తిడి తెస్తున్నారట..

అయితే వివేక్ కు పెద్దపల్లి ఎంపీ సీటు కన్ఫం అయ్యింది. పెద్ద పల్లి ఎంపీగా ఉన్న సుమన్ ను చెన్నూర్ కు మార్చారు... ఆయన సోదరుడు వినోద్ కు మాత్రం టికెట్ ఇప్పించడంలో వివేక్ విఫలమయ్యాడు.

ఈనెల 6న కాకా వెంకటస్వామి జయంతి రోజున కేసీఆర్ సమావేశమై చెన్నూర్ టికెట్ కోసం ఒత్తిడి తెద్దామని అనుకున్నా కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో కేటీఆర్ ను కలిశారు. నల్లాల ఓదెలు అసమ్మతితో సుమన్ గెలిచే పరిస్థి లేదని.. ఆ స్థానంలో వినోద్ కు ఇవ్వాలని కోరారట.. కానీ కేటీఆర్ తన అనుచరుడు సుమన్ ని మార్చేది లేదని స్పష్టం చేశాడట..

 తాజాగా వివేక్ వర్గీయులు చెన్నూరులో బాల్క సుమన్ కు వ్యతిరేకంగా పనిచేయాలని డిసైడ్ అయ్యారట... వినోద్ ను ఇండిపెండెంట్ గా పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నారు. అయితే కేసీఆర్ కు ఎదురెల్లి అలా చేస్తే రాబోయే రోజుల్లో తీవ్రంగా నష్టపోతామని.. వివేక్ ఈ ప్రతిపాదనకు నో చెప్పాడట..  వినోద్ మాత్రం తనకు సీటు దక్కకపోవడంపై ఆగ్రహంతో ఉన్నారట.. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో బాల్క సుమన్ కోసం కలిసి పనిచేసే అవకాశాలు లేవని వినోద్-వివేక్ లు డిసైడ్ అయినట్టు సమాచారం. ఈ పరిణామంతో బాల్క సుమన్ గెలుపు అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
Tags:    

Similar News