చంద్రబాబు ఢిల్లీ టూర్...టార్గెట్ అదేనా?

అమరావతి, పోలవరం నిధుల గురించి కూడా కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చించబోతున్నారని తెలుస్తోంది.

Update: 2024-11-15 09:47 GMT

ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు ఢిల్లీలో పర్యటించబోతున్నారు. ఓ మీడియా సంస్థ నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబు హస్తిన బయలుదేరారు. ఆ సదస్సులో పాల్గొన్న తర్వాత పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కాబోతున్నారు. రైల్వే శాఖ మంత్రితో కూడా చంద్రబాబు సమావేశం కాబోతున్నారు.

ఈ క్రమంలోనే విశాఖ రైల్వే జోన్ పనుల ప్రారంభ ముహూర్తం పై ఈ భేటీలో నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. అమరావతి, పోలవరం నిధుల గురించి కూడా కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చించబోతున్నారని తెలుస్తోంది.

ఈ నెల 29న విశాఖకు ప్రధాని మోదీ రాబోతున్న నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. విశాఖలో రైల్వే జోన్, అమరావతి నూతన రైల్వే లైన్ పనులను మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.

అమమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు వచ్చే నెల నుంచి ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పనులు కూడా మోదీ చేతుల మీదుగా మొదలుబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఢిల్లీ సమావేశంలో వీటికి సంబంధించిన నిర్ణయాలు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News