జగన్ విశాఖ నివాసం మీద ఎప్పటికపుడు చర్చ సాగుతూనే ఉంది. చంద్రబాబు అయితే అసలు విశాఖకు జగన్ ఎందుకు రావడం అని ఎకసెక్కం ఆడారు. జగన్ విశాఖ వస్తే జనాలకు ఒరిగేదేముంది అని కూడా అనేశారు. జగన్ విశాఖ వస్తే అది విశాఖ రాజధానికి సంకేతం అవుతుంది. జగన్ వస్తే విశాఖ అభివృద్ధి చెందుతుంది అని వైసీపీ నేతలు అంటున్నారు.
ఇదిలా ఉంటే జగన్ విశాఖ వచ్చి కాపురం ఉంటే వైసీపీకి ప్రజలకు ఏమి కలసి వస్తుందో తెలియదు కానీ గత రెండున్నరేళ్లుగా ఉద్యమిస్తున్న విశాఖ ఉక్కు కార్మికులకు మాత్రం చాలానే కలసివస్తుంది అని అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తామని కేంద్రం 2021 జనవరి నెలాఖరులో చెప్పింది. నాటి నుంచి విశాఖ ఉద్యమాలు జరుగుతున్నాయి.
రెండు టెంట్లు వేసి మరీ కార్మికులు, ఉద్యోగస్తులు విశాఖలో ఉద్యమాన్ని ఏళ్ల తరబడి కొనసాగిస్తున్నారు. ఒకటి కూర్మన్నపాలెం వద్ద స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద టెంట్ వేసి దీక్ష చేపడితే రెండవది విశాఖ మహా నగర సంస్థ ఎదుట టెంట్ వేసి దీక్ష చేపడుతున్నారు. ఈ రెండిటికీ 800 రోజుల ఉద్యమ చరిత్ర ఉంది.
ఇపుడు ఈ రెండూ కాకుండా మూడవ టెంట్ ని ఒకదాన్ని వేసి ఆందోళన చేపట్టాలని కార్మికులు ఆలోచిస్తున్నారు. ఆ టెంట్ ఎక్కడ అంటే విశాఖకు జగన్ సెప్టెంబర్ లో వస్తున్నారు కాబట్టి ఆయన నివాసం ఎదురుగా అని అపుడే డిసైడ్ అయిపోతున్నారు. జగన్ విశాఖలో ఎక్కడ నివాసం ఉంటే అక్కడ ఆయన ఇంటి ఎదురుగానే టెంట్ వేసి ఉద్యమిస్తే ఆ కిక్కే వేరబ్బా అని తలపోస్తున్నారుట.
నిజానికి స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి వైసీపీ మద్దతు ఇచ్చింది. కానీ కేంద్రం దూకుడు చేస్తూంటే ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు లేవని కార్మిక సంఘాలు వాపోతున్నాయి. కేంద్రం మీద వత్తిడి తీసుకుని రావలసిన వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదని కూడా అంటున్నారు. దాంతో విశాఖలో జగన్ నివాసం ఎదురుగా టెంట్ వేసి ఆందోళన చేయడమే శరణ్యం అని కూడా అంటున్నారు.
అంటే జగన్ కి ఇక ప్రతీ రోజూ ఉక్కు సెగ గట్టిగా తగులుతుంది అన్న మాట. ఒక వేళ ఈ టెంట్ కి సీఎం క్యాంప్ ఆఫీస్ అధికారులు అడ్డుపడినా పోలీసులు ఒప్పుకోకపోయినా విశాఖ స్టీల్ ప్రైవేట్ కావడమే వైసీపీకి ఇష్టం అని ప్రచారం చేయడానికి చూస్తారని అంటున్నారు. అంటే ఏ విధంగా చూసినా తమ పోరాటం హైలెట్ అయ్యేలాగానే రూపొందించారని అంటున్నారు.
ఇక సీఎం జగన్ ఇంటి ముందు ఆందోళన విషయంలో వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేల మద్దతుని కూడా తీసుకోవాలని ఉక్కు కార్మిక సంఘాలు ఆలోచిస్తున్నాయట. ఏది ఏమైనా ఇపుడు విశాఖ ఉక్కు ఇష్యూతో ఏకంగా సీఎం జగన్ని ఇరికించే విధంగానే కధ సాగుతోంది అన్న మాట. ఎటూ సీఎం జగన్ ఇంటి ముందు దీక్ష అంటే అనుమతి ఇవ్వరు, అలా విశాఖ ఉక్కు పోరాటానికి వైసీపీ వ్యతిరేకం అని తేల్చేసుకుంటారా. ఏమో చూడాల్సి ఉంది.