విశాఖ నుంచే పాలన.. జగన్ ముహూర్తం ఖరారు

Update: 2020-06-26 07:00 GMT
మూడు రాజధానుల విషయంలో ముందుకే వెళ్లాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వచ్చే అక్టోబర్ నాటికి సచివాలయాన్ని అమరావతి నుంచి తరలించడం ఖాయంగా కనిపిస్తోందని సమాచారం. దసరా నుంచి విశాఖ నుంచే పరిపాలన సాగాలే సీఎం జగన్ రెడీ చేస్తున్నారని తెలుస్తోంది.

సీఎం జగన్ మూడు రాజధానులపై వెనక్కి వెళ్లకూడాదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. తాజాగా గవర్నర్ ప్రసంగంలోనూ జగన్ వినిపించారు. వచ్చే అక్టోబర్ నాటికి తరలింపు ఖాయమని తెలుస్తోంది. అసెంబ్లీలోనూ దీన్ని చర్చించారు.

అక్టోబర్ 25 విజయదశమి పండుగ కల్లా సచివాలయం, సీఎం కార్యాలయాన్ని విశాఖకు మార్చడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నాడని అధికార వర్గాలు తెలిపాయి. భీమిలిలోని మూతబడిన ఓ ఇంజినీరింగ్ కాలేజీని తాత్కాలిక సచివాలయంగా మార్చవచ్చని తెలుస్తోంది. మాజీ సీఎం రోశయ్య అల్లుడు పైడా కృష్ణ ప్రసాద్ కు చెందిన పైడా ఇంజినీరింగ్ కాలేజీ రెండేళ్ల నుంచి మూతపడింది. దీన్నే సచివాలయంగా మారుస్తారని సమాచారం.

విశాఖ శారదా పీఠాధిపతి సూచనల మేరకు దసరా నాటికి సచివాలయాన్ని తరలిస్తారంటూ వార్తలు వచ్చాయి.ఇదే మూహూర్తాన్ని జగన్ విశాఖ నుంచి పాలించడానికి ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News