యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా వ్యవహరించిన మనీశ్ తివారి చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఆయన.. మూడేళ్ల కిందట జరిగిన విషయం అంటూ చెబుతున్న ఒక మాట ఇప్పుడు సంచలనంగా మారింది. మూడేళ్ల కిందట హర్యానా నుంచి రెండు ఆర్మీ యూనిట్లు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఢిల్లీ వైపు బయలుదేరిందంటూ వ్యాఖ్యానించటం కలకలం రేపుతోంది.
తనకు తెలిసినంతవరకు తాను చెబుతున్నది నిజమని.. తాను ఆ సమయంలో రక్షణశాఖపై పార్లమెంటు స్థాయి సంఘంలో ఉన్నట్లుగా మనీశ్ చెబుతున్నారు. రెండు యూనిట్ల ఆర్మీ కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని చెబుతున్న మనీశ్ మాటలపై ఇటు బీజేపీతో పాటు.. అటు కాంగ్రెస్ నేతలు సైతం తీవ్రంగా ఖండిస్తున్నాయి. మనీశ్ మాటల్లో నిజం లేదని తప్పు పడుతున్నాయి. ఇక.. మాజీ ఆర్మీ చీఫ్ అయితే మనీశ్ కు ఎలాంటి పని లేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా ఆరోపించారు.
ఒకవేళ నిజంగా మనీశ్ కు పని లేకపోతే.. మరెన్నో వ్యాఖ్యలు చేయొచ్చు. కానీ.. ఈ తరహా వ్యాఖ్యలు ఆయన ఎందుకు చేస్తున్నట్ల? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. సొంత పార్టీ నేతలు ఖండిస్తున్నా.. మనీశ్ మాత్రం తాను చేసిన వాదనకే కట్టుబడి ఉండటం గమనార్హం.