అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆయన రహస్య మిత్రుడనే పేరున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరియా మీద అమెరికా క్షిపణి దాడులు చేయడం, దాన్ని రష్యా పరోక్షంగా ఖండించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత రష్యా - అమెరికా సంబంధాలు దరిద్రంగా తయారయ్యాయని పుతిన్ మండిపడినట్లు క్రిమ్లిన్ పేర్కొంది. సైనిక సంబంధ విషయాల్లో ఇద్దరి మధ్య నమ్మకం మెరుగుపడకపోగా, మరింత దిగజారిపోయిందని పుతిన్ వ్యాఖ్యానించినట్లు వివరించింది. తిరుగుబాటు దారులు ఉన్నారన్న సాకుతో సిరియా ప్రభుత్వం రసాయన దాడులకు పాల్పడిన విషయం గురించి ప్రస్తావిస్తూ...అసలు సిరియా ఎప్పుడో తన రసాయన ఆయుధాలను వదిలిపెట్టేసిందని, ఇక ఆ తరహా దాడి చేసే అవకాశం ఎక్కడ ఉంటుందని ఆయన అన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత రష్యా - అమెరికా సంబంధాలు దరిద్రంగా తయారయ్యాయని రేడియో ఇంటర్వ్యూలో పుతిన్ చెప్పినట్లు వివరించింది.
కాగా, దశాబ్దలుగా అమెరికా, రష్యా ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ పరిస్థితిలో మార్పు ఉంటుందని అంతా భావించారు. ప్రపంచంలో రెండు సూపర్ పవర్లు ఒకటవుతాయని ఆశపడ్డారు. దానికి కారణం లేకపోలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఏకపక్షంగా ట్రంప్ కు మద్దతు పలికారు. తెరవెనుక తన వంతు సహాయం చేశారని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని గ్రహించిన హిల్లరీ క్లింటన్ సైతం ట్రంప్‌ను హెచ్చరించారు. ఐనా పట్టించుకోకుండా ట్రంప్ సైతం రష్యాతో చెలిమికి జై కొట్టారు. అటు ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత…ఇక అమెరికా, రష్యా స్నేహ బంధం బలపడుతుందని అంచనా వేశారు.
కానీ ప్రస్తుతం సీన్ పూర్తిగా ఛేంజ్ అయ్యింది. సిరియాలో నెలకొన్న పరిస్థితులతో అమెరికా అధ్యక్షుడు, రష్యా ప్రెసిడెంట్ కి ఒకరంటే ఒకరికి అస్సలు పడటం లేదు. సిరియాలో అధిపత్యం కోసం ఇరు దేశాలు పోటీ పడుతున్నాయి. దీంతో రష్యా విషయంలో ట్రంప్ వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చింది. రష్యాను ఎదుర్కొనే విషయంలోనూ ఆయన దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రపంచంలో మంచిని రష్యా సపోర్ట్ చేయటం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారంటా. సిరియా అధ్యక్షుడు, పుతిన్ అనుసరిస్తున్న విధానాలు ట్రంప్ కు తీవ్ర ఆగ్రహం కలిగిస్తున్నాయని తెలుస్తోంది. ఈ కారణంగానే రష్యాను క్లిష్టమైన భాగస్వామిగా ట్రంప్ భావిస్తున్నాడంటా. సిరియా విషయంలో ఎంత వరకైనా పోరాడేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అటు పుతిన్ సైతం పట్టుదలతో ఉన్నారు. దీంతో రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయని భావించిన వారందరికీ నిరాశే ఎదురైంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/