భయం గుప్పిట్లో ఏపీ...విదేశీయుల లెక్క తేల్చే పనిలో నిమగ్నమైన వాలంటీర్లు!
ఆంధప్రదేశ్ లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదికి చేరింది. రోజురోజుకి ఏపీలో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం తో ఏపీలో కూడా ఆందోళన మొదలైంది. నిన్న మొన్నటి వరకు మొన్న రాష్ట్రంలో యాక్టివ్ గా ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య 7 కాగా.. ఇప్పుడు అది పదికి చేరింది. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులే ఇందుకు కారణం. తొలుత రాష్ట్రానికి విదేశాల నంచి వచ్చిన వారిని ప్రభుత్వం గుర్తించిన సంఖ్యకు, తాజాగా బయటపడుతున్న కేసులకూ పొంతన లేకపోవడంతో అందరిలో ఆందోళన మొదలైంది.
విదేశాల నుంచి ఏపీకి తిరిగి వచ్చిన 12 వేల 500 మంది ప్రయాణికులను విమానాశ్రయాల నుంచి నేరుగా క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు గత వారం ఏపీ సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్ వెల్లడించారు. ఆ తర్వాత రోజే కేంద్రం జనతా కర్ఫ్యూ పేరిట అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసింది. ఈ లెక్క ప్రకారం .. ఇప్పటివరకూ రాష్ట్రానికి చేరుకున్న విదేశీ ప్రయాణికుల సంఖ్య 12 నుంచి 13 వేల మధ్యనే ఉండాలి. కానీ తాజాగా ప్రభుత్వం చెబుతున్న విదేశీ ప్రయాణికుల సంఖ్య 13 వేలు కూడా దాటిపోయింది. కానీ , ఇదే ఫైనల్ నెంబర్ అని మాత్రం చెప్పలేదు. విదేశాల నుంచి నేరుగా ఏపీలోని విమానాశ్రయాలకు వచ్చిన వారిని నేరుగా కరోనా పరీక్షల కోసం క్వారంటైన్ కు పంపారు. వీరిలో నెగెటివ్ గా తేలిన వారిని ఇళ్లకు కూడా పంపేశారు. కానీ ఏపీలో విమానాశ్రయాలు కాకుండా ఇతర రాష్ట్రాల్లోని విమానాశ్రయాలకు వచ్చి అక్కడి నుంచి రైలు, రోడ్డు మార్గాల్లో రాష్ట్రానికి చేరుకున్న వారి సంఖ్య ఇప్పుడు తేలడం లేదు
దీంతో ప్రభుత్వంలో ఆందోళన పెరుగుతోంది. అయితే వీరి గుర్తింపు కోసం రాష్ట్రంలో గ్రామ, వార్డు వాలంటీర్లు, ఆశా వర్కర్ల సాయం తీసుకుని ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇలా ప్రభుత్వం కళ్లు గప్పి ఇళ్లకు చేరుకున్న విదేశీ ప్రయాణికుల్లో ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. ఇంట్లో ఉండి కరోనా లక్షణాలు కనిపించడం తో చికిత్స కోసం తొలుత వీరు ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. అక్కడి నుంచి వీరిని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మరికొందరు పారాసిటమాల్ మాత్రలు వేసుకుని, విదేశాల నుంచి రాగానే ధర్మల్ స్కానింగ్ చేయించుకుని ఇళ్లకు వెళ్లిపోయిన వారు కూడా ఉన్నారు. వీరికి కూడా క్రమంగా కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి.
ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆస్పత్రుల్లో క్వారంటైన్ పొందుతున్న వారితో పాటు ప్రభుత్వం కళ్లుగప్పి ఇళ్లకు వెళ్లిపోయిన వారిలో ఎవరైనా కరోనా బాధితులు ఉన్నారేమో తేలడానికి మరో వారం రోజులు పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే వీరి ద్వారా కరోనా ప్రబలిన స్ధానికులు ఎవరైనా ఉంటే వారి గుర్తింపు కూడా ఈ లోగా సాధ్యమవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మొత్తంగా మరో వారం రోజులు గడిస్తే కానీ ఏపీలో పరిస్థితులు అంచనా వేయలేని పరిస్థితి ఉంది.