ఒక వైపు ప్రభుత్వం పేద ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటే ..కొందరు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం మాముళ్లకి అలవాటు పడి ప్రజలని లంచం ఇవ్వాలి అంటూ పీక్కుతింటున్నారు. ముఖ్యంగా ఈ దందా రెవెన్యూ ఆఫీసుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఏళ్ల తరబడి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా తీరని సమస్యలతో ఎంతోమంది భాదపడుతున్నారు. దీనితో కొంతమంది ఈ మధ్య కాలంలో అధికారులపై తిరగబడుతున్న ఘటనలు కూడా చూస్తున్నాం..తిరిగి తిరిగి ఓపిక నశిస్తే ఎవరైనా ఏంచేస్తారు పాపం. అలాగే మరి కొంతమంది మాత్రం తమకి ఉన్న ఏకైక ఆధారం ఆ పొలమే అంటూ అధికారుల కాళ్లా వేళ్లా పడ్డా కూడా వారు కనికరించడంలేదు. తాజాగా ఒక విఆర్ ఏ దగ్గరకి పాస్ పుస్తకం కావాలి అని పొతే ..లక్ష ఇస్తాం ..మీ పొలం వదులుకోండి అని స్వయంగా ఆయనే బేరానికి దిగాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా లో జరిగింది.
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కి చెందిన రైతు గురక వెంకట లక్ష్మమ్మ. తమ పొలానికి పట్టాదారు పాస్ పుస్తకం కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ, అధికారుల చుట్టూ కొన్నినెలలుగా తిరుగుతూనే ఉంది. 'పాస్ పుస్తకం రాదు. లక్ష ఇస్తాం. పొలం వదులుకోండి' అని స్వయంగా వీఆర్ ఏ ఆమె తో బేరానికి దిగడంతో ఆమె షాక్ అయిపోయింది . న్యాయం చేయాల్సిన అధికారే ఇలా అంటే ఇక దిక్కెవరు? అని వాపోయింది. దీనితో సోమవారం ప్రకాశం జిల్లా రాచర్ల మండల రెవెన్యూ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి వచ్చిన రెవెన్యూ ఇన్ స్పెక్టర్ కాళ్ల పై పడి తనకి తగిన న్యాయం చేయాలనీ జరిగిందంతా చెప్పింది.
పూర్తి వివరాలు చూస్తే .. రాచర్ల మండలం సోమిదేవి పల్లి కి చెందిన గురక కోటమ్మకు ఇద్దరు కుమారులు. వారిలో ఒకరైన లక్ష్మీ రెడ్డి తన తల్లి పేరు మీద ఉన్న 2.75 ఎకరాల పొలం లో తన సగం వాటా రిజిష్టర్ చేయించుకున్నాడు. తన వాటాగా వచ్చిన పొలాని కి పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేయాలంటూ నాలుగు నెలల క్రితం మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నారు. లక్ష్మీ రెడ్డి పొలం పనుల్లో ఉండటం తో, ఆయన తరఫున వెంకట లక్ష్మమ్మ అధికారు ల చుట్టూ తిరుగుతోంది. అయినా పని కావడం లేదు. ఎందుకనేది స్పందన కార్యక్రమానికి వచ్చిన ఆర్ ఐ కి కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పుకుంది. పొలానికి పాస్ పుస్తకం కోసం అని వస్తే .. లక్ష తీసుకుని పొలం వదులుకోవాలని వీఆర్ ఏ ఒత్తిడి తెస్తున్నారు అని, మాకు ఆ పొలమే ఆధారం, న్యాయం చేయండి అంటూ కాళ్ళపై పడి ప్రాధేయపడింది. ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేపడుతున్న ఇలాంటి అధికారుల వ్యవహార తీరు వల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది.