ఏపీ అధికారపక్షానికి పెద్ద దిగులు వచ్చి పడింది. ముఖ్యలు.. వీవీఐపీలు ఎవరైనా హైదరాబాద్ వచ్చినప్పుడు వారిని కలిసే విషయంలో తెలంగాణ రాష్ట్ర అధికారపక్షం పోటీ పడుతోంది. దీంతో.. హైదరాబాద్ వచ్చే ప్రముఖులకు మా చెడ్డ ఇబ్బందిగా మారింది.
ఇరువురు ముఖ్యమంత్రుల్ని కలవాల్సిన పరిస్థితి. ఈ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా ఇబ్బంది తప్పదు. అలా అని ఏపీ సీఎంను కలిస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రికి కోపం రావొచ్చు. అలా అని.. కేసీఆర్ గురించి మాత్రమే ఆలోచిస్తే.. ఏపీ ముఖ్యమంత్రి నొచ్చుకునే అవకాశం ఉంది. దీంతో.. తెలుగు రాష్ట్రాలవైపు వచ్చే ప్రముఖులకు.. ఈ వ్యవహారం అసౌకర్యంగా మారిందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖులు కాస్తంత తెలివిగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ వచ్చే ప్రముఖులు తమ ప్రయాణంలో హైదరాబాద్‌తో పాటు.. తిరుమలను కూడా చేర్చుకుంటున్నారు. దీంతో.. తెలంగాణ స్టేట్‌లో కేసీఆర్‌ను కలిసేసి.. ఏపీ స్టేట్‌లో తిరుపతిలో కలిసేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో.. ఒకపక్క చంద్రబాబు ఈగో దెబ్బ తినకుండా చూసుకోవటంతో పాటు.. చంద్రుళ్ల మధ్య సమతూకం దెబ్బ తినకుండా జాగ్రత్త పడుతున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర విభజన ఏమో కానీ.. ప్రముఖులకు మాత్రం తెలుగు రాష్ట్రాలకు రావాలంటే మాత్రం ఆచితూచి అడుగువేయాల్సి వస్తున్న పరిస్థితి.