బ‌డ్జెట్ః ఇవి చీప్‌...వీటిపై బాదేశారు

Update: 2017-02-01 14:02 GMT
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ‌పెట్టిన బ‌డ్జెట్లో ప‌లు వ‌స్తువులు, సేవ‌ల‌పై ధ‌ర‌లు పెరుగుతుండ‌గా మ‌రికొన్నింటిపై చార్జీల భారం మోపారు. ముఖ్యంగా సిగరెట్లు, బీడీలపై సుంకం పెరిగింది. పాన్ మసాలాపై సుంకం 6 నుంచి 9 శాతానికి పెంచినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఫిల్టర్ రహిత సిగరెట్లపై అదనపు సుంకం ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. కింగ్ సైజ్ సిగరెట్లపై సుంకం పెంపు చేసిన‌ట్లు వివ‌రించారు. ఖైనీ, జర్దా, గుట్కాపై సుంకం 6 నుంచి 12 శాతానికి పెంపు ఉంటుంద‌ని తెలిపారు.మొబైల్ ఫోన్లలో ఉపయోగించే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు ధ‌ర పెరుగుతాయి.

వీటిపై చార్జీలు తగ్గుతాయి.

- ఆన్‌ లైన్‌ టికెట్ బుకింగ్

-ఎల్‌ ఎన్‌ జీపై సుంకం 5 నుంచి రెండున్నర శాతానికి తగ్గింపు

-సోలార్ ప్లేట్లపై సుంకం రద్దు

-బయోగ్యాస్ యంత్రాలపై - ఔషధాల్లో వినియోగించే రసాయనాలపై సుంకం తగ్గింపు

-మొబైల్ ఫోన్ సర్క్యూట్ బోర్డులపై 2 శాతం సుంకం

-ముడి అల్యూమినియంపై దిగుమతి సుంకం 30 శాతం

-పీఓఎస్ యంత్రాలు - ఐరిస్ యంత్రాలపై సుంకం మినహాయింపు

-స్టార్టప్‌ లకు 7 ఏళ్ల వరకు పన్ను రాయితీలు

-వెండి - వెండితో తయారైన వస్తువులపై 12.5 శాతం దిగుమతి సుంకం

-జీడిపప్పు దిగుమతులపై సుంకం 30 నుంచి 45 శాతానికి పెంపు

-వాటర్ ఫిల్టర్ల ధరలు తగ్గే అవకాశం
Tags:    

Similar News