ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో చాలా దేశాలు ఇబ్బందులు పడుతుంటే తాజాగా చైనా-తైవాన్ మధ్య కూడా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. సైనిక సంపత్తిలో రష్యా ముందు ఉక్రెయిన్ చిట్టెలుక అయినట్లే డ్రాగన్ ముందు తైవాన్ కూడా చిట్టెలుకలాంటిదే. కాకపోతే ఉక్రెయిన్ కు అమెరికాతో పాటు కొన్నిదేశాల మద్దతున్న కారణంగా తైవాన్ కూడా రెచ్చిపోతోంది. అంటే ఉక్రెయిన్ అయినా తైవాన్ అయినా అమెరికా రెచ్చగొట్టడం వల్ల రెచ్చిపోతున్నాయన్నది వాస్తవం.
మూడు రోజుల క్రితం తైవాన్(తైపి)లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోని పర్యటించిన తర్వాత హఠాత్తుగా చైనా-తైవాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఎప్పటినుండో తైవాన్ను తనలో కలిపేసుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది.
శతాబ్దాల పాటు చైనాలో భాగంగానే ఉన్న తైవాన్ 1949లో స్వతంత్రం ప్రకటించుకున్నది. వెంటనే తైవాన్ కు అమెరికా మిత్రదేశాలు మద్దతుగా నిలిచాయి. దాంతో అప్పటి నుండి ఈ రెండుదేశాల మధ్య ఏదో గొడవలు జరుగుతునే ఉన్నాయి.
తైవాన్ పైకి యుద్ధం చేయటానికి చైనా రెడీ అయినప్పుడల్లా అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ లాంటి దేశాలు ఎదురుగా వచ్చి నిలబడుతున్నాయి. దాంతో ఎప్పటికప్పుడు యుద్ధ ప్రయత్నాలను డ్రాగన్ విరమించుకుంటోంది. కానీ ఇఫుడు చాలా స్పీడుగా వెళుతోంది చైనా. తాజాగా తైవాన్ చుట్టూ సుమారు 100 యుద్ధ విమానాలను, యుద్ధ నౌకలను చైనా మోహరించింది. పదికి పైగా డ్రెస్టాయర్లను కూడా తైవాన్ వైపు మోహరించింది.
తమ సైన్యాన్ని తైవాన్ చుట్టూ మోహరించటమే కాకుండా విన్యాసాలను వీడియో తీసి ప్రపంచానికి విడుదలచేసింది. దీంతో అమెరికా మిత్రదేశాలు గోల మొదలుపెట్టేశాయి. దీనికి ప్రతిగా తమ సైనిక బలాన్ని కూడా తైవాన్ కు మద్దతుగా దింపేందుకు పై దేశాలు రెడీ అవుతున్నాయి.
దీంతో చైనా ఎప్పుడేమి చేస్తుందో అనే టెన్షన్ ప్రపంచదేశాల్లో పెరిగిపోతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగానే చాలా దేశాలకు చమురు, వంటనూనెలు, గ్యాస్, గోధుమలు, బొగ్గు కొరతతో అల్లాడుతున్నాయి. ఇక చైనా-తైవాన్ యుద్ధం కూడా మొదలైతే అంతే సంగతులు.