వరంగల్ ఉప ఎన్నిక; ఒక్కో రౌండ్ కి ఎంతసేపు?

Update: 2015-11-24 04:02 GMT
మరికాసేపట్లో వరంగల్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. ఎనిమిది గంటలకు మొదలయ్యే ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కార్యక్రమం.. ఎంతసేపటికి ఫలితంపై ఒక స్పష్టత వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎనిమిది గంటలకు లెక్కింపు మొదలైనప్పటిది మొదటి గంటలోనే ఫలితానికి సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు మొదలయ్యాక.. తొలి ఫలితం 8.20 గంటలకు రానుంది. ఉదయం 9.30కు ఉప ఎన్నిక ఫలితానికి సంబంధించి పూర్తి స్పష్టత ఖాయం.

వరంగల్ ఎంపీ నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. అయితే.. ఒక్కో రౌండ్ లెక్కింపునకు ఎంత సమయం పడుతుందన్నదే ఫలితం వెలువడటానికి కీలకం కానుంది. భూపాల పల్లి ఓట్ల లెక్కింపును 22 రౌండ్లలో.. పాలకుర్తి 19.. స్టేషన్ ఘన్ పూర్ 20.. పరకాల 17.. వరంగల్ పశ్చిమ 17.. వర్థన్నపేట 19.. వరంగల్ తూర్పులో 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం ఓట్ల లెక్కింపు 22 రౌండ్లలో పూర్తి కానుంది.  ఉదయం 8.20గంటలకు తొలి రౌండ్ ఫలితం వెలువడినా..తుది ఫలితం వచ్చేసరికి మధ్యాహ్నం 2 గంటలకు వెలువడనుంది.

ప్రతి ఆరు నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తొలి రెండు రౌండ్ల లెక్కలోనే.. ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారన్నది తేలిపోనుంది. అయితే.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ వర్గానికి సంబంధించి తొలి రౌండ్ ఫలితం ముగిసిన తర్వాత.. అన్నింటికి కలిపి ఫలితం వెలువరించనున్నారు. ఒక్కో రౌండ్ కి ఆరు నిమిషాల సమయం తీసుకునే నేపథ్యంలో.. కౌంటింగ్ మొదలైన స్వల్ప వ్యవధిలోనే ఫలితంపై సమాచారం వెల్లడి కానుంది.
Tags:    

Similar News